Kangana Ranaut : విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం బాలీవుడ్ బ్యూటీ, సౌత్ చంద్రముఖి కంగానా రనౌత్ నైజం. కేవలం సినిమా విషయాల్లోనే కాదు రాజకీయ అంశాలపైన ముక్కు సూటిగా ఎలాంటి భయం లేకుండా మాట్లాడే నటి ఆమె. అందుకే ఈ బ్యూటీకి ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ లైన్ వచ్చింది. తాజాగా కంగనా తన పర్సనల్ విషయాలను షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా తన ప్రేమ బ్రేకప్ గురించి అదే విధంగా పెళ్లిపై తనకున్న అభిప్రాయాన్ని గురించి చాలా క్లియర్ గా చెప్పి అందరిలో ఉన్న కన్ఫ్యూషన్స్ ని తొలగించింది.
కంగనా నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా మంచి కథతో ముందుకు వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తూ సినిమాలను చేస్తోంది. ఈ మధ్యనే సౌత్ నువ్వు సూపర్ డూపర్ హిట్ సాధించిన చంద్రముఖి సీక్వెల్ లో కనిపించి తన అందంతో అందరి హృదయాలను దోచేసింది. సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ కంగనా అందం అందరిని కట్టిపడేసింది. కంగనా నటించిన మరో మూవీ తేజస్ అక్టోబర్ 27న రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ లో భాగంగా కంగనా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
” రిలేషన్ ఏదైనా ఎప్పుడూ ఒకేలా ఉండదు. లవ్ విషయంలో అందరూ విజయాలు సాధించలేరు. నేను ఒకప్పుడు ప్రేమలో పడిన దానినే. కానీ కొన్ని కారణాల వల్ల మా ప్రేమకు బ్రేక్ పడింది. నిజానికి బ్రేక్ అప్ వల్ల నాకు మంచే జరిగింది. ఒకవేళ నేను ప్రేమలో ఉన్నట్లయితే నా సమయం మొత్తం దానికే కేటాయించేదాన్ని. కానీ, లక్కీగా లవ్ ఫెయిల్యూర్ వల్ల నాకు లాభాలు ఎన్నో జరిగాయి. అయితే ఆ లాభాలు ఏంటి అనేది అందరికి కాస్త ఆలస్యంగా తెలుస్తాయి” అంటూ తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది కంగనా.
ఇక పెళ్లిపై తనకున్న అభిప్రాయాలు ఏంటో చెబుతూ” ప్రతి అమ్మాయి పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. తనకు పెళ్లి జరగాలని,పిల్లలు పుట్టాలని, తనకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటుంది. నేను కూడా అలాంటి అమ్మాయినే భారతీయ కుటుంబ వ్యవస్థ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. నేను కూడా పెళ్లి చేసుకోవాలని నా ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను. వచ్చే ఐదు ఏళ్లలోనే నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అయితే అందుకు ఓ కండిషన్ ఉంది. నేను పెద్దలు కుదిర్చిన లవ్ మ్యారేజ్ ని మాత్రమే చేసుకుంటాను. ఎందుకంటే నా పెళ్లి పెద్దల సమక్షంలో జరగాలని అనుకుంటున్న” అన కంగన తెలిపింది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.