Tollywood : మణిశర్మని అవమానించిన రాంగోపాల్ వర్మ..!

Tollywood : మెలోడి బ్రహ్మగా పాపులర్ అయిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మని ఓ సందర్భంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ అవమానించారట. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాకు మణిశర్మ నేపథ్య సంగీతం అందించారు. ఆ సమయంలో రాంగోపాల్ వర్మకి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందట. అప్పట్లో రాంగోపాల్ వర్మ క్రేజ్ ఇటి తెలుగులో అటు హిందీలో విపరీతంగా ఉండేది.

ముంబైలో అయితే వర్మ ఆఫీస్ ముందు నిర్మాతలు క్యూ కట్టేవారు. ముంబైలో ఆర్జీవీ ఆఫీసు ఉన్నంత వెరైటీగా ఇంకో దర్శకుడిది గానీ, నిర్మాతది గానీ లేదంటే ప్రతీ విషయంలో ఆర్జీవీ ఎంత వినూత్నంగా ఆలోచించేవారో తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో కూడా డెన్ ప్రారంభించారు. ఆర్జీవీ. ఇక్కడ ఉన్న సినిమా వాళ్ళు గానీ, కామన్ ఆడియన్స్ గానీ ఆర్జీవీ డెన్ ని ఒక్కసారైనా చూడాల్సిందే.

tollywood-ramgopal-varma-insulted-mani-sharma

Tollywood : సంగీత దర్శకుడిగా మణిశర్మకి మొదటి పాట అదే.

టెక్నీషియన్స్ దగ్గర్నుంచి వర్క్ ని ఎలా రాబట్టుకోవాలో ఆర్జీవీకి తెలిసినంతగా ఇంకో దర్శకుడికి తెలియదని సినిమా వాళ్ళే ఒప్పుకున్నారు. అదే అప్పట్లో మణిశర్మని రెచ్చగొట్టేలా చేసింది. ఆర్జీవీ అంతం సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘చలెక్కి ఉందనుకో’ అనే పాటకి సంగీతం అందించమని రామూ మణిశర్మని అడిగారు. అదే సంగీత దర్శకుడిగా మణిశర్మకి మొదటి పాట. ఈ పాట ఛాన్స్ ఇవ్వడానికి ముందు నువ్వు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే బాగా చేస్తావు గానీ, సాంగ్స్ కంపోజ్ అంటే నీ వల్ల అవుతుందా..? అని అనుమానించారట.

అది ఎంతో ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకున్న మణిశర్మ అంతం సాంగ్ కంపోజ్ చేసి చూపించారు. అది నచ్చిన ఆర్జీవీ చిరంజీవితో మనం సినిమా చేస్తున్నాము. నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని సర్‌ప్రైజ్ ఇచ్చారట. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయింది. అయినా మణిశర్మ ఆ తర్వాత చూడాలని ఉంది అనే సినిమాకి సంగీతం అందించే అవకాశం నేరుగా చిరంజీవి నుంచే అందుకోవడం విశేషం.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

15 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

17 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.