Categories: LatestMovies

Kangana Ranaut : డైరెక్టర్ సార్ మీ భార్య మిమ్మల్ని వాడుకుంటోంది..కంగనా కామెంట్స్

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న రనౌత్ కు ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాపిక్ ఎలాంటిదైనా, ముందుంది ఎంతటి వారైనా భయపడకుండా, ఎలాంటి బెరుకు లేకుండా తన అభిప్రాయాన్ని తెలిపి వారిని ఎదురిస్తుంది. బాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. సినిమా నుంచి పొలిటికల్ వరకు ప్రతి అంశంపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పడంలో కంగనా వెనుకడుగు వేయదు. ఇండస్ట్రీలోనూ చాలా మంది కంగనా బాధితులు ఉన్నారు. బాలీవుడ్ క్వీన్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డైరెక్టర్ భార్యపై ఘాటైన వ్యాఖ్యలు చేసి ఆమెపై విరుచుకుప‌డింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

Kangana-ranaut-bollywood-actress-fires-on-director-wife

బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ అనే సినిమా తీశారు. ఈ మూవీ బాలీవుడ్ బ్లాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో దూసుకుపోతోంది. విమర్షకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రేసులోకి కూడా వెల్లబోతోంది. అయితే ఈ క్రమంలో డైరెక్టర్ భార్య ఈ సినిమాను థియేట‌ర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అనుప‌మ చోప్రా సలహా ఇచ్చిందట. ఈ విష‌యం తెలుసుకున్న కంగనా అగ్గిమీదగుగ్గిలం అయ్యింది. డైరెక్టర్ భార్యాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. “విధు వినోద్ చోప్రా సర్ మీ భార్య అనుపమ చోప్రా సినీ జర్నలిజం రంగానికి అప్రతిష్ట. ఆమె జెనోఫోబియాను చూపించడమే కాకుండా ప్రతిభావంతులైన యువ మహిళలపై ఆమెకు తీవ్రమైన అసూయ వచ్చింనట్లుంది. ఆమె తన భర్తను చూసి అసూయపడటంలో ఎలంటి సర్‎ప్రైజ్ లేదు. తన వెబ్‌సైట్ ను ఇతర బిజినెస్ లను కంటిన్యూ చేయడానికి మీ పేరును, ప్రాపర్టీని వాడుకుంటోంది. అసలైన టాలెంట్ కు , మంచి మూవీస్ కు ఆమె వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్‌లోని కొన్ని గాసిప్ సర్కిల్స్‌తో ఆమె క‌లిసి వర్క్ చేస్తోంది. తనను తాను సరిదిద్దుకోవడానికి మీ భార్య బాలీవుడ్ వైఫ్ కార్డ్‌ సినిమా మీటింగుల్లో వాడుకుంటోంది” అని కంగనా అనుపమ చోప్రాపై ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది.

Kangana-ranaut-bollywood-actress-fires-on-director-wife

కంగనా చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం నెట్టింట్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ మధ్యనే తేజస్ తో ముందుకొచ్చిన కంగనా అది డిజాస్ట‌ర్ కావడంతో మరో మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. లేటెస్టుగా ఈ భామ ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తన లాస్ట్ మూవీ తేజస్ పై అనుపమ్ చోప్రా నెగెటివ్ సమీక్షలు రాసింది. ఈ మూవీనే కాదు కంగనా నటించిన చాలా వరకు చిత్రాలపై డైరెక్టర్ భార్య ప్ర‌తికూల స‌మీక్ష‌లు రాసారు. దీంతో ఒళ్లు మండిన కంగనా సమయం రావడంతో నెట్టింట్లో ఓ రేంజ్ లో డైరెక్టర్ భార్యపై విరుచుకుపడింది.

Sri Aruna Sri

Recent Posts

Water Bottle: వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Water Bottle: సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాము. అది ఎండాకాలమైనా లేదా వర్షాకాలమైనా…

9 hours ago

Bhaumvati Amavasya 2026: నేడే బౌమా అమావాస్య.. పితృ,కుజ దోష నివారణకు అనుకూలం!

Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా…

9 hours ago

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

1 day ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

1 day ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

5 days ago

This website uses cookies.