Kalyan Krishna Kurasala: కాన్సెప్ట్ ఫిలిమ్స్ పతాకంపై ఈ మార్చి 15న ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘లంబసింగి’. భారత్ రాజ్, దివి జంటగా నటించారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా మారి నిర్మించిన ఈ మూవీకి నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ:
ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు, మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఒకటే. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది ఉన్నారు. నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి. అందుకే నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు పట్టింది.
Kalyan Krishna Kurasala: ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ మొదటి అవకాశం ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఇక దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. అందరికి అవకాశాలు రావాలి. దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతనికి మంచి భవిషత్తు ఉండాలి. నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఆర్.ఆర్.ధ్రువన్ పెద్ద సంగీత దర్శకుడు అవుతారు. ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు. ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది. లంబసింగి సినిమాను అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్న.. అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ మాట్లాడుతూ…
‘లంబసింగి’ సినిమా నాకు చాలా స్పెషల్. సాంగ్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. సినిమా చూసి వచ్చిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను.. అన్నారు.
నటుడు మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. .
సినిమాకు అందరి దగ్గర నుండి మంచి రెస్పాన్ వస్తోంది. దివి, భారత్ చాలా నేచురల్ గా పర్ఫార్మ్ చేశారు. ఒక మంచి లవ్ స్టొరీని డైరెక్టర్ గారు అందంగా చూపించారు. ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది.. అన్నారు.
చిత్ర దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ…
ఈ కథ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు అదే బరువైన హృదయంతో బయటికి వస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన జీ.కె.మోహన్ గారికి థాంక్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అందరూ వారి బెస్ట్ ఇచ్చారు. దివి, భారత్ చాలా ఇంటెన్స్ తో నటించాని, మా ‘లంబసింగి’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ దివి మాట్లాడుతూ…
కళ్యాణ్ కృష్ణ గారు ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము, నవీన్ గాంధీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. రెస్పాన్స్ బాగుందని అన్నారు.
హీరో భారత్ రాజ్ మాట్లాడుతూ…
కళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వంలో ఒక చిన్న రోల్ చెయ్యాలని అనుకున్నాను. కానీ, నాకు ఆయన నిర్మాతగా చేసే సినిమాలో లీడ్ రోల్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, క్రెడిట్ మొత్తం ఆర్.ఆర్.ధ్రువన్ గారికి చెందుతుంది, నవీన్ గాంధీ గారు సినిమాను తీసిన విధానం చాలా బాగుంది. వీరవాబు పాత్రను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
This website uses cookies.