లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ ఈ నెల ఆరంభంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన కళాఖండాలు టాలీవుడ్ కి అందించిన దర్శక ధీరుడు కె విశ్వనాథ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కె విశ్వనాథ్ సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఆమె ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. భర్త మరణంతో కొద్ది రోజులుగా దుఃఖంతో ఉన్నా ఆమె మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఆమె మరణించినట్లు సమాచారం. భర్త మరణించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఆమె మరణించడం ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. భర్త మృతిని తట్టుకోలేకనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కె విశ్వనాథ్ టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుకుగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో అతన్ని రిప్లేస్ చేసే దర్శకుడు రాడని సినీ ప్రముఖులు సైతం చెబుతున్నారు. అలాంటి లెజెండరీ దర్శకుడిని కోల్పోవడం కచ్చితంగా లోటని అంటున్నారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.