Categories: EntertainmentMovies

K Viswanath: దివికేగిన దిగ్గజం… విశ్వనాథుడి కీర్తి అజరామరం

అలాంటి దర్శక దిగ్గజం మరణం ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అని చెప్పాలి. గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ లో ఆయన మృతి చెందారు. వృద్ధాప్యం కారణంగా గత కొంత కాలంగా విశ్వనాథ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన వయస్సు 92 ఏళ్ళు. ఇక విశ్వనాథ్ మృతితో తెలుగు చిత్రపరిశ్రమ మూగబోయింది.

ఒక్కసారిగా టాలీవుడ్ ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మరణం ఇండియన్ సినిమాకి తీరని లోటని అభివర్ణించారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కమల్ హాసన్ కూడా వచ్చి పలకరించి వెళ్ళారు. కమర్షియల్ హీరో అయిన చిరంజీవి విశ్వనాథ్ మీద ఉన్న అభిమానంతో ఆ ఇమేజ్ ని పక్కన పెట్టి స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు చేశారు. ఈ సినిమాలు చిరంజీవి ఇమేజ్ ని నటుడిగా మరో ఎత్తుకి తీసుకొని వెళ్ళాయి.

k-viswanath-died

అప్పటి నుంచి చిరంజీవికి విశ్వనాథ్ పై ప్రత్యేక అభిమానం ఉంది. ఒక తండ్రి స్థానంలో అతన్ని ఉంచుతాడు. ఇక విశ్వనాథ్ అంటే ఎన్నో కళాఖండాలు కనిపిస్తాయి. శంకరాభరణం సినిమాతో జాతీయ అవార్డుని అందుకోవడంతో పాటు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సినిమాగా గుర్తింపు తెచ్చిపెట్టారు. అలాగే విశ్వనాథ్ సినిమా అంటే భారతీయ సంగీతం, సాహిత్యం, నృత్యం మూలాలని స్పృశిస్తూ కథ, కథనాలు ఉంటాయనే మాట వినిపిస్తుంది.

ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఎంతో మంది భారతీయ సంగీతం, నృత్యాలపై మక్కువ పెంచుకోవడానికి ఆయన చేసిన స్వర్ణకమలం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శృతి లయలు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.  అలాంటి మరుపురాని చిత్రాలని తెరకెక్కించిన విశ్వనాథ్ ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా విచారకరం.

Varalakshmi

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago