Jr NTR: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు తమ హీరో సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి అంటూ ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో హీరోలు, దర్శకులు, నిర్మాతలకి డైరెక్ట్ గా ట్యాగ్ చేసే అడిగే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా అప్డేట్స్ కోసం పోస్టులు పెట్టి తెగ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా తారక్ 30 మూవీ గురించి నందమూరి ఫ్యాన్స్ ఎన్ని సార్లు హ్యాష్ ట్యాగ్ సృష్టించి వైరల్ చేసారో చెప్పాల్సిన పని లేదు.
గత ఏడాది కాలంగా తారక్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్వీట్ లతో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమా అప్డేట్స్ కావాలంటూ రచ్చ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, బన్నీ ఫాన్స్ కూడా ఇదే స్థాయిలో రచ్చ చేస్తూ ఉంటారు. అయితే ఫ్యాన్స్ ఇలా సోషల్ మీడియాలో పెట్టె పోస్టులపై చాలా మంది కథనాలు వండి వార్చేస్తున్నారు.
అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇలా వచ్చిన వార్తలని కొంత మంది నిజమని నమ్ముతున్నారు. దీంతో హీరోలకి, దర్శక, నిర్మాతల ఫ్యాన్స్ టార్చర్ ఈ మధ్య ఎక్కువ అయిపొయింది అని చెప్పాలి.ఈ నేపధ్యంలోనే తాజాగా అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ అభిమానులపై ఈ విషయంలో కాస్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఏవైనా ఉంటే ఇంట్లో వారికంటే ముందుగా మీకే చెబుతాం అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎలాంటి అప్డేట్ లేకపోయిన ఇవ్వమని ప్రతి రోజు, ప్రతి క్షణం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే దర్శకులు, నిర్మాతల మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
ఆ టెన్సన్ లో వారు ఏదో ఒకటి రిలీజ్ చేస్తే మళ్ళీ బాగోలేదని మీరే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతుంది. ఇలాంటి సమయంలో సినిమాలు చేసే సమయంలో కథల విషయంలో అన్ని రకాలుగా ఆచితూచి అడుగులు వేయాలి. మేరు అప్డేట్స్ అంటూ పెట్టె టెన్షన్ కి హీరోలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, అలాగే దర్శక, నిర్మాతలు కూడా టెన్సన్ పడుతున్నారు. మీకు మంచి చిత్రాలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దయచేసి ఇబ్బంది పెట్టకండి అంటూ సున్నితంగానే తారక్ అందరి హీరోల ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా వార్నింగ్ కాల్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.