Categories: LatestMoviesNews

Balakrishna: నర్స్ లకి క్షమాపణలు చెప్పిన బాలయ్య

Balakrishna: రాజకీయాల సంగతి ఏమోగానీ ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఏం మాట్లాడినా కూడా దానిని వైసీపీ సోషల్ మీడియా వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తుంది. జనవరి నెలలో బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో ఒక కులాన్ని కించపరిచే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ తీసుకొచ్చారు. దానిపై కొద్ది రోజులు చాలా హడావిడి చేశారు. అయితే ఆ అంశంపై బాలకృష్ణ స్పందించి కించపరిచే విధంగా సంభాషణలు ఉంటే క్షమించాలని కోరారు. దీంతో ఆ వివాదం ముగిసింది. అయితే తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో బాలకృష్ణ సందర్భోచితంగా తనకు రోడ్డు ప్రమాదం జరిగిందని ఆ సమయంలో ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడే ఉన్న నర్స్ తనకి ప్రమాదం జరిగిన విషయం చెప్పిందని చెప్పారు.

balakrishna-say-sorry-to-nurses

అయితే ఆ నర్సుని ఉద్దేశించి చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ అంశాన్ని వివాదంగా మార్చి నర్సులను ఉద్దేశించి బాలకృష్ణ తప్పుగా మాట్లాడారని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైసిపి సోషల్ మీడియా టీం రచ్చ చేస్తుంది. ఇక కొంతమంది నర్సుల అసోసియేషన్ అనుకుంటూ ముందుకు వచ్చి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న తాజాగా బాలకృష్ణ ఈ అంశంపై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తన మాటలను వక్రీకరించి ఒక వర్గం మీడియా కావాలనే దుష్ప్రచారం చేసిందని బాలకృష్ణ పేర్కొన్నారు.

రోగులకు సేవలు అందించే నర్సులను సోదరి సమానులుగా చూస్తానని, వారిపై తర్కి చాలా గౌరవం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నర్సులు చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూసినవాడిగా వారి మీద తనకే ఎంతో గౌరవం, కృతజ్ఞత భావం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.బి కరోనా కష్టకాలంలో కూడా నర్సులు రాత్రి పగలు అనకుండా సేవలు చేశారని కొనియాడారు. తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. దీంతో నర్సుల వివాదానికి బాలకృష్ణ పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. 

Varalakshmi

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

5 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.