Categories: LatestMoviesNews

Jr NTR: అభిమానులని హెచ్చరించిన తారక్… అప్డేట్స్ అంటూ

Jr NTR:  ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు తమ హీరో సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి అంటూ ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో హీరోలు, దర్శకులు, నిర్మాతలకి డైరెక్ట్ గా ట్యాగ్ చేసే అడిగే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా అప్డేట్స్ కోసం పోస్టులు పెట్టి తెగ ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా తారక్ 30 మూవీ గురించి నందమూరి ఫ్యాన్స్ ఎన్ని సార్లు హ్యాష్ ట్యాగ్ సృష్టించి వైరల్ చేసారో చెప్పాల్సిన పని లేదు.

గత ఏడాది కాలంగా తారక్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్వీట్ లతో హోరెత్తిస్తున్నారు. అదే సమయంలో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమా అప్డేట్స్ కావాలంటూ రచ్చ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, బన్నీ ఫాన్స్ కూడా ఇదే స్థాయిలో రచ్చ చేస్తూ ఉంటారు. అయితే ఫ్యాన్స్ ఇలా సోషల్ మీడియాలో పెట్టె పోస్టులపై చాలా మంది కథనాలు వండి వార్చేస్తున్నారు.

jr-ntr-gives-warning-to-fans

అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇలా వచ్చిన వార్తలని కొంత మంది నిజమని నమ్ముతున్నారు. దీంతో హీరోలకి, దర్శక, నిర్మాతల ఫ్యాన్స్ టార్చర్ ఈ మధ్య ఎక్కువ అయిపొయింది అని చెప్పాలి.ఈ నేపధ్యంలోనే తాజాగా అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ అభిమానులపై ఈ విషయంలో కాస్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.సినిమాకి సంబందించిన అప్డేట్స్ ఏవైనా ఉంటే ఇంట్లో వారికంటే ముందుగా మీకే చెబుతాం అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎలాంటి అప్డేట్ లేకపోయిన ఇవ్వమని ప్రతి రోజు, ప్రతి క్షణం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే దర్శకులు, నిర్మాతల మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

 

ఆ టెన్సన్ లో వారు ఏదో ఒకటి రిలీజ్ చేస్తే మళ్ళీ బాగోలేదని మీరే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతుంది. ఇలాంటి సమయంలో సినిమాలు చేసే సమయంలో కథల విషయంలో అన్ని రకాలుగా ఆచితూచి అడుగులు వేయాలి. మేరు అప్డేట్స్ అంటూ పెట్టె టెన్షన్ కి హీరోలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, అలాగే దర్శక, నిర్మాతలు కూడా టెన్సన్ పడుతున్నారు. మీకు మంచి చిత్రాలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. దయచేసి ఇబ్బంది పెట్టకండి అంటూ సున్నితంగానే తారక్ అందరి హీరోల ఫ్యాన్స్ కి డైరెక్ట్ గా వార్నింగ్ కాల్ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

4 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

4 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

4 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

4 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.