Categories: EducationLatestNews

Jio: జియో ల్యాప్ ట్యాప్ లు… అతి తక్కువ ధరల్లో మార్కెట్ లోకి

Jio: జియో ల్యాప్ ట్యాప్ లు… అతి తక్కువ ధరల్లో మార్కెట్ లోకి
దేశీయ టెలికాం, ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ జియో. దేశీయ మార్కెట్ ని జియో ప్రస్తుతం శాసిస్తుంది అని చెప్పాలి. రిలయన్స్ నుంచి జియో సిమ్ లతో మొదటిగా టెలికాం మార్కెట్ లోకి సరికొత్తగా వచ్చి ఉచిత ఆఫర్స్ తో అతి తక్కువ కాలంలో టెలికాం మార్కెట్ పై రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబాని ఆధిపత్యంలోకి వచ్చారు. అన్ని టెలికాం సేవలని దాటిపోయి దేశంలోనే అత్యధికంగా వినియోగించే సేవలుగా జియో మార్కెట్ లో నిలిచింది.

ఇక అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తన జియో మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నారు. జియో సిమ్ లతో కలిపి జియో ఫోన్స్ ని అతి తక్కువ ధరల్లో సామాన్యులకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్మార్ట్ ఫోన్ లో ఉన్న వీడియో, యూట్యూబ్ ఫీచర్స్ ని చిన్న సెల్ లోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫోన్ లు విపరీతంగా సేల్ అయ్యాయి. ఇక ఇప్పుడు టెలికాం రంగంలో సరికొత్త అధ్యయనంగా భావించే 5జీ సేవలని ఇండియాలో మొట్టమొదటిగా జియో స్టార్ట్ చేస్తుంది.

జియో5జీ సేవలని ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం స్టార్ట్ చేశారు. 2023 ఆఖరుకి 5జీ సేవలని దేశ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంగా జియో నెట్ వర్క్ పనిచేస్తుందని ముఖేష్ అంబానీ తాజాగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్ లని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ల్యాప్ టాప్ ఖరీదు ప్రస్తుతం 25 వేల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే జియో ల్యాప్ టాప్ లని కేవలం 15 వేల రూపాయిల ధరలలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇందులో జియో ఫీచర్స్ తో, పాటు ల్యాప్ టాప్ కి అవసరమయ్యే ప్రధాన ఫీచర్స్ ని ఇన్ బిల్ట్ గా ఇవ్వబోతున్నారు. ఇక ఈ ల్యాప్ టాప్ కోసం జియో సంస్థ ఇప్పటికే మైక్రో సాఫ్ట్ తో ఆపరేటింగ్ సిస్టమ్ కోసం, ప్రొసెసర్స్ కోసం క్వాల్ కమ్ తో ఒప్పందం చేసుకుంది. ఇక మైక్రో సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని మార్పులు చేసి జియో ఆపరేటింగ్ సిస్టంని, కొన్ని యాప్స్ ని లిమిటెడ్ గా ఇతర సాఫ్ట్ వేర్స్ ని ల్యాప్ టాప్ లో అందించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ల్యాప్ టాప్ లని వీలైనంత వేగంగా మార్కెట్ లోకి తీసుకొచ్చి అందరికి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలలో వినిపిస్తుంది. ఇక ల్యాప్ టాప్ లో ఇతర యాప్స్ కావాలన్నా జియో స్టోర్ కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని ఈ ల్యాప్ టాప్ లని డెవలప్ చేస్తున్నారని తెలుస్తుంది. భవిష్యత్ లో టెక్, టెలికాం రంగంలో తమ ఆధిపత్యం చూపించుకుని దిశగా ముఖేష్ అంబానీ ఇలా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

5 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

6 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.