Jani Master: పాత వీడియోలన్నీ తిరగేస్తున్నారుగా మాస్టారు..?

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన పాత వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వ్యవహారంలో సెలబ్రీటీలు అబాసుపాలవుతున్నారు. గతంలో చేసిన తప్పులన్నీ తవ్వకాల్లో బయటపడుతున్నాయి. ఇంట్లో వాళ్ళు వద్దన్నా డాన్స్ అంటే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ నృత్య దర్శకుడు రాకేష్ మాస్టర్ దగ్గర శిక్షణ పొంది అసిస్టెంట్ గా స్టార్ హీరోల సినిమాలకి పనిచేస్తూ పరిచయాలు పెంచుకున్నాడు జానీ మాస్టర్.

అతి కొద్ది కాలంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. ప్రభుదేవా లాంటి సీనియర్ కొరియోగ్రఫీ అందించిన సాంగ్స్ కి కొంత సపోర్ట్ చేశాడు. ప్రస్తుతం జానీ మాస్టర్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాలలోని పాటలకి డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తూ బిజీగా ఉన్నాడు. శేఖర్ మాస్టర్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతేకాదు, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కన్నడలో కిచ్చా సుదీప్, తమిళంలో విజయ్ లాంటి అగ్ర హీరోలకి జానీ మాస్టర్ బాగా దగ్గరయ్యాడు.

jani-master-the-master-is-turning-all-the-old-videos

Jani Master: జానీ మాస్టర్ కెరీర్ ఎలా టర్న్ అవబోతుందో

ఇప్పటి వరకూ కొరియోగ్రాఫర్ గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో బిహేవియర్, క్యారెక్టర్ పరంగా అంత చెడ్డపేరునూ వెంట తెచ్చుకున్నాడు. అది ఢీ లో కంటెస్ట్ గా, ఆ తర్వాత జానీ మాస్టర్ వద్ద సహాయకురాలిగా పనిచేసిన శ్రష్ఠి అనే కొరియోగ్రాఫర్ బట్టబయలు చేసింది. ఆమె చెప్పిన విషయాలు చూసి ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయింది.

ఇద్దరి కాంబినేషన్‌లో ‘యధారాజా తధాప్రజా’ సినిమా కూడా ప్రారంభమైంది. అది రిలీజ్ కాకుండా జానీ మాస్టర్ చేసిన నిర్వాకాలను బాదితురాలు బయటపెట్టి జానీ మాస్టర్ లోపలికి వెళ్ళేలా చేసింది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ వైపే అన్నీ వేళ్ళు చూపిస్తున్నాయి. ఇదే సమయంలో జానీ కి సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. వీటిలో శ్రష్ఠి తో కలిసి చేసే సినిమా వీడియో, ఢీలో ఆయన అరిచి కేకలు పెట్టి మైక్ ఫ్లోర్ కి విసిరికొట్టిన వీడీయో లాంటివి ఉన్నాయి. మరి జానీ మాస్టర్ కెరీర్ ఎలా టర్న్ అవబోతుందో అని అందరూ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

1 week ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

1 week ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

1 week ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

1 week ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

1 week ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

1 week ago

This website uses cookies.