Janasena: ఏపీలో విశాఖ కేంద్రంగా మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. గత కొంత కాలంగా అమరావతి టూ అరసవిల్లి రైతుల పాదయాత్ర జరుగుతుంది. దీనికి అడ్డంకులు సృష్టించేందుకు, ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణ రాజకీయం తెరపైకి తీసుకొచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్రకి విశాఖ రాజధానిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అని విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించారు.
ఒక పవన్ కళ్యాణ్ కూడా విశాఖ గర్జన రోజునే ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకొని జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేనికి గర్జన అంటూ వైసీపీ నేతలని ప్రశ్నిస్తూ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఇక వైసీపీ భారీ ఎత్తున మూడు జిల్లాల నుంచి జన సమీకరణ చేసి విశాఖ గర్జనని పెద్ద ఎత్తున నిర్వహించింది. జోరు వానలో కూడా ర్యాలీ నిర్వహించి గర్జనని విజవంతం చేయడంతో పాటు పనిలోపనిగా పవన్ కళ్యాణ్ మీద వైసీపీ మంత్రులు వ్యక్తిగత విమర్శలతో దాడి చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి రావడంతో అక్కడికి పెద్ద ఎత్తున జనసైనికులు చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు తిరిగి ప్రయాణంలో ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన సమయంలో జనసైనికులు పెద్ద ఎత్తున వారిని అడ్డుకొని డౌన్ డౌన్ నినాదాలతో మంత్రుల కార్లపై దాడి చేశారు. పోలీసులు జనసైనికులని తప్పించి మంత్రులు అందరిని క్షేమంగా ఎయిర్ పోర్ట్ లోపలికి తీసుకొని వెళ్లిపోయారు. జనసైనికుల దాడితో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ పరిసరాలలో ఉద్రిక్తత వాతారవరణం ఏర్పడింది.
ఇక వైసీపీ మంత్రులు తక్షణమే మీడియా ముందుకి వచ్చి జనసైనుకుల దాడులని ఖండించారు. అలాగే వైవీ సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక జనసేన నాయకులు కూడా వైసీపీ నేతలపై ఎదురుదాడి చేశారు. గర్జన సభ ఫెయిల్యూర్ కావడంతో దానిని డైవర్ట్ చేయడానికి కొత్త నాటకాలకి వారు తెరతీశారని విమర్శించారు. జనసేన కార్యకర్తల ముసుగులో వారే దాడులు చేయించుకున్నారని విమర్శించారు. ఇక తమ మీద తాము దాడులు చేయించుకొని విపక్షాల మీదకినెట్టేయడం వైసీపీకి అలవాటు అయిన విద్య అని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.
జనసేన, వైసీపీ మధ్య జరిగిన ఈ దాడుల రాజకీయంపై మీడియా ఫోకస్ అంతా వెళ్ళిపోయింది. గర్జన పేరుతో వికేంద్రీకరణకి మద్దతుగా వైసీపీ చేసిన ర్యాలీ అంతా పక్కకి పోయింది. ఇక రేపు జనవాణి జరగనున్న నేపధ్యంలో వైసీపీ శ్రేణులు కూడా జనసేన దాడులకి ప్రతిగా తిరిగి దాడులు చేసే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ముగిసేంత వరకు పెద్ద పరీక్ష గా ఈ రాజకీయ క్రీడ మారింది. ఏది ఏమైనా విశాఖ వేదికగా వైసీపీ, జనసేన, టీడీపీ రాజకీయం ఇప్పుడు వైసీపీ వెర్సస్ జనసేనగా మారిపోయిందని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.