AP Capital: ఏపీలో రాజధానులపై గత మూడేళ్ళుగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అజెండాతో అధికార పార్టీ వైసీపీ ముందుకి వెళ్తుంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి రైతులు సైతం రాజధాని తరలింపు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల ఆందోళనని అస్సలు పట్టించుకోవడం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నం వేదికగా గ్లోబల్ సమ్మిట్ ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్ లో దేశ, విదేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
అలాగే దేశీయ కంపెనీలకి సంబందించిన అధిపతులు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి జగన్ మరోసారి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని అని ఈ సమ్మిట్ లో జగన్ తెలియజేశారు. తాను కూడా త్వరలో విశాఖపట్నం రాబోతున్నా అని తెలిపారు. ఇక్క అద్భుతమైన వనరులు ఉన్నాయని, ప్రకృతి అందాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి కూడా విశాఖ అనువైన వాతావరణం ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. ఇక మీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతాలు ఏపీ లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని జగన్ తెలిపారు. ఇక తాను కూడా త్వరలో విశాఖపట్నంలో నివాసం ఏర్పరుచుకుంటా అని తెలిపారు. ఇక 304 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో కి రాబోతున్నాయని తెలిపారు. అలాగే 6 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని జగన్ తెలిపారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.