Movies: ఇండియాలో హైయెస్ట్ మూవీ బిజినెస్ జరిగేది టాలీవుడ్ లోనేనా?

Movies: సినిమా అనేది వ్యాపారం అనే సంగతి అందరికి తెలిసిందే. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిర్మాతగా నిలబడాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా కూడా సక్సెస్ వస్తే వచ్చే రాబడి మాత్రం వేరే లెవల్ లో ఉంటుంది అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమాపై రూపాయి ఖర్చు పెడితే వంద రూపాయిలు, ఒక్కోసారి వెయ్యి రూపాయిలు కూడా వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది సినిమా అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ కావాలంటే మాత్రం ఇక్కడి లొసుగులు, వ్యాపార ముసుగులు అన్ని కరెక్ట్ గా అర్ధం చేసుకోవాలి.

అలాగే 24 ఫ్రేమ్స్ గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరి మీదనో నమ్మకంతో చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అనే ఉద్దేశ్యంతో నిర్మాతగా అడుగుపెడితే దెబ్బతినడం గ్యారెంటీ. ఎందుకంటే చాలా మంది తాము దర్శకులు కావాలని కలలు కంటూ ఉంటారు. అయితే వీరిలో కసితో సినిమా సక్సెస్ కొట్టి స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని భావించే వారు తక్కువ మంది ఉంటారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఇండియాలో హైయెస్ట్ మూవీ బిజినెస్ జరిగే ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ పేరు వినిపించేది.

అక్కడ సినిమా నిర్మాణ ఖర్చు ఎక్కువగా ఉండేది. అలాగే ఆర్టిస్ట్స్ రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా ఉండేది. దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన రూలింగ్ కొనసాగించింది. అయితే ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ తన ఆధిపత్యాన్ని చూపించే దిశగా అడుగులు వేస్తుంది. ఇండియాలో మొదటి సారిగా హైయెస్ట్ బడ్జెట్ మూవీ బాహుబలి తెరకెక్కింది టాలీవుడ్ లోనే. 500 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతున్నది కూడా తెలుగు నుంచే కావడం విశేషం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బడ్జెట్ సుమారు 500 కోట్ల వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పైనే దృష్టి పెట్టారు.

లార్జర్ దెన్ లైఫ్ అనే విధంగా విజువల్ వండర్ అనిపించే కథలని ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకి రీచ్ అయ్యే కంటెంట్ పైనే దృష్టి పెడుతున్నారు. ఈ నేపధ్యంలో నిర్మాతలు, హీరోలు అందరూ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో చేయబోయే రెండు సినిమాల బడ్జెట్ 150 కోట్ల పైనే. ఇక రామ్ చరణ్ చేతిలో ఆరు ప్రాజెక్ట్ ఉన్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒకటి కాగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు మరో మూడు ప్రాజెక్ట్స్ ఫైనల్ అయ్యి ఉన్నట్లు తెలుస్తుంది.

ఇలా రామ్ చరణ్ మీద ఒక వెయ్యి కోట్ల వరకు నిర్మాతలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ప్రభాస్ లైన్ అప్ చూసుకుంటే సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్, స్పిరిట్, దిల్ రాజు ప్రొడక్షన్ లో రవణం, సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీటి బడ్జెట్ చూసుకుంటే 2500 కోట్ల వరకు ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత స్టార్ దర్శకులు లైన్ లో ఉన్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ మూవీతో పాటు, రాజమౌళితో పాన్ వరల్డ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యి ఉన్నారు. వీటి బడ్జెట్ చూసుకుంటే వెయ్యి కోట్ల వరకు ఉంటుంది.

ఇలా ఒక్కో హీరో మీద తక్కువలో తక్కువ 500 కోట్ల నుంచి 2500 కోట్ల వరకు టాలీవుడ్ లో వ్యాపారం జరుగుతుంది. వీరితో నిర్మిస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా కథలే కావడం విశేషం. ఇవన్ని రిలీజ్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ స్టామినా ప్రపంచానికి తెలియడంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కచ్చితంగా టాలీవుడ్ జెండా ఎగరేయడం పక్కా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

23 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

6 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.