Prabhas : మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఉన్నపలంగా విదేశాలకి వెళ్ళినట్టు ఓ తాజా వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాల తర్వాత టాలీవుడ్‌లో అందరికంటే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్నారు.
ఆ క్రమంలోనే అన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలను చేస్తూ వస్తున్నారు. వరుసగా సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టపోయినా ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K చిత్రాలతో పాటు స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ ప్రభాస్ రేంజ్‌కి తగ్గవే.
అయితే, ఇటీవల ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి తర్వాత ప్రభాస్ ఏమాత్రం ఖాళీగా ఉండదలచుకోలేదు. అందుకే, బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. అయితే, గత ఏడాది ప్రభాస్ కాలికి సర్జరీ జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేదు. అలాగే ఇప్పుడు కూడా ఇలా అఫీషియల్ అప్‌డేట్ లేకుండా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్ షూటింగ్ వదిలేసి ఒక్కసారిగా విదేశాలకి బయలుదేరారట. ఏయిర్ పోర్ట్‌లో కనిపించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఆరోగ్య సమస్య ఏదో వచ్చినట్టు..దానికోసమే కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయించుకునేందుకే ఆయన విదేశాలకి వెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో ఆయనే స్వయంగా వెల్లడిస్తే గానీ క్లారిటీ దొరకదు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.