Politics: బీజేపీపై కేసీఆర్ అస్త్రాలు సిద్ధమేనా… మోడీ లక్ష్యంగా విమర్శల దాడి

Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ, ప్రధాని మోడీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ పార్టీ తనకి బలమైన ప్రత్యర్ధిగా మారుతుందని గ్రహించిన కేసీఆర్ తన వ్యూహాలకి తెరతీసారు. అందులో భాగంగా ఏకంగా మోడీపైనే విమర్శలు చేయడం ద్వారా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం కూడా చాలా కీలకం. అయితే బీజేపీతో కయ్యం పెట్టుకోవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన చాలా నిధులు ఆగిపోతాయని కూడా కేసీఆర్ కి తెలుసు. అయితే దీనినే మరోసారి ప్రజలలో తనపై నమ్మకం పెంచుకోవడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పార్టీ అడ్డం పడుతుందనే విమర్శలతో ప్రజలలో సెంటిమెంట్ ఎమోషన్ ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

మరో వైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయడానికి బీజేపీ వెనకనుండి పావులు కదుపుతుంది. బీజేపీ వ్యూహాలని ముందే పసిగట్టిన కేసీఆర్ వారికి దీటుగా తన ఆలోచనలకి పదును పెట్టి ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళు వ్యవహారంలో బీజేపీ పార్టీ నేతలని రెడ్ హ్యాండడ్ టీఎస్ పోలీసులతో పట్టుకున్నారు. ఇక ఆ వ్యవహారం మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా విజయాన్నిఅందించింది అనేది అందరూ ప్రత్యక్షంగా చూసారు. మరో వైపు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత పేరుని రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడం ద్వారా బీజేపీ పార్టీ కూడా తన రాజకీయ చతురతకి పదును పెట్టి టీఆర్ఎస్ పార్టీ మొత్తం స్కామ్ లు, అవినీతి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రచారం ఆర్బాటం కల్పిస్తూ తెలంగాణ ప్రజలలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత పెంచుతున్నారు.

అలాగే మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలపై కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దీని వెనుక బీజేపీ పార్టీ ఉందనే విషయం కేసీఆర్ కూడా గ్రహించారు. ఈ నేపధ్యంలో మరోసారి మహబూబ్ నగర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో కేంద్రంలో బీజేపీ పార్టీ విధానాలపై నేరుగా విమర్శల దాడి చేశారు. తెలంగాణలో ఉన్న స్థాయిలో ఇండియాలో అభివృద్ధి లేదని, ఇదంతా ప్రధానిగా మోడీ వైఫల్యం వలనే అని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది అని అన్నారు. ఏకంగా 3 లక్షల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రాంతం బీజేపీ కారణంగా కోల్పోయిందని అన్నారు.

ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పి ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నం మోడీ, అమిత్ షా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అండదండలు ఉంటే బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలలోకి వెళ్లి బీజేపీతో బలంగా పోరాడుతానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ తన రాజకీయ చతురతతో తెలంగాణ ప్రజలని ప్రాంతీయ సెంటిమెంట్ తో రెచ్చగొట్టి బీజేపీ పార్టీ నుంచి ఎదురుకాబోయే పోటీ నుంచి బయటపడి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Game Changer: రామ్ చరణ్ తప్పించుకోగలడా..?

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…

22 hours ago

Tollywood Exclusive: ప్రభాస్ ‘రాజు’ ని టచ్ చేసేదెవరు..?

Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…

3 days ago

The Rana Daggubati Show Trailer: రానా కొత్త టాక్ షో..సెలబ్రిటీలెవరంటే..

The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…

6 days ago

Bhagyashri Borse: కాస్త అటు ఇటుగా ఆ హీరోయిన్‌లాగే ఉంది..ఎవరూ గుర్తు పట్టలేదు..!

Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…

2 weeks ago

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

3 weeks ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

4 weeks ago

This website uses cookies.