CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v80), default quality?
Health care: సాధారణంగా మనం బయటకు వెళ్లి ఏదైనా ఆహార పదార్థాలు లేదా స్నాక్స్ వంటివి తినే సమయంలో చాలామంది న్యూస్ పేపర్లో ఆహార పదార్థాలను పెట్టిస్తూ ఉంటారు. ఇలా న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ చాలా మంది న్యూస్ పేపర్ లోనే ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఇక పై ఎవరు కూడా న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను తినరు. మరి న్యూస్ పేపర్ లో ఆహార పదార్థాలను తినటం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయం పేపర్లో హెచ్చరికలు జారీ చేసింది. హోటల్ రెస్టారెంట్స్ అలాగే వీధులలో దొరికే చిరు తిండి పదార్థాలను న్యూస్ పేపర్ పై పెట్టుకొని తినటం వల్ల ఆహారం విషంగా మారే అవకాశాలు ఉంటాయి. న్యూస్ పేపర్ ప్రింటింగ్ లో ఉపయోగించే సిరాలో లెడ్, కాడ్మియం, పిగ్మెంట్స్ అలాగే మినరల్ ఆయిల్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. అందువల్ల మనం వేడివేడిగా ఆహార పదార్థాలను న్యూస్ పేపర్లో పెట్టుకొని తినటం వల్ల ఆహారం విషంగా మారే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, డయేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. న్యూస్ పేపర్ లో ఉపయోగించే హెవీ మెటల్స్ మన శరీరంలో పేరుకు పోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతూ డామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే క్యాన్సర్ రావడానికి కూడా దోహదపడతాయి. పిల్లలు శారీరక ఎదుగుదలపై కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పూర్తిగా తగ్గించి అనేక అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది. అందుకే న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహార పదార్థాలను తినకపోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.