Tollywood: టాలీవుడ్‌లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించిన వార్త ఇటు సోషల్ మీడియాను, అటు ఫిలిం నగర్ వర్గాలను తెగ హల్‌చల్ చేస్తోంది. ‘ఉప్పెన’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సాన, సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక ఇంట్రెస్టింగ్ లైన్ వినిపించారని, వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందనేది ఆ వార్తల సారాంశం. అయితే, ప్రస్తుత పరిస్థితులు, ఇండస్ట్రీ టాక్ పరిశీలిస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం దాదాపు అసాధ్యమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముగియడానికి చాలా సమయం పడుతుంది. పైగా, జక్కన్న సినిమా థియేటర్లలోకి వచ్చాక సూపర్ స్టార్ ఇమేజ్, మార్కెట్ రేంజ్ పూర్తిగా మారిపోవడం ఖాయం. ఆ గ్లోబల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా తన తదుపరి సినిమాల లైన్-అప్ ఉండాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’ బ్యానర్‌లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అందుకోసం ఓ స్టార్ డైరెక్టర్‌ను కూడా లైన్లో పెట్టినట్లు గట్టిగా వినిపిస్తోంది.
మరోవైపు, బుచ్చిబాబు-మహేష్ కాంబో రూమర్లపై సూపర్ స్టార్ అభిమానులు అస్సలు హ్యాపీగా లేరు. దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. బుచ్చిబాబు మార్క్ అనగానే ‘రా అండ్ రస్టిక్’ ఎమోషన్స్ గుర్తొస్తాయి. కానీ, ‘వారణాసి’ లాంటి విజువల్ వండర్ తర్వాత మహేష్ బాబును మళ్లీ అంతకంటే లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లోనే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బుచ్చిబాబు స్టైల్ కథలు సూపర్ స్టార్ క్లాస్ ఇమేజ్‌కు ఎంతవరకు సెట్ అవుతాయనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. అందుకే, ఈ కాంబో కేవలం రూమర్‌గానే మిగిలిపోయేలా ఉంది తప్ప, నిజమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఏదేమైనా వారణాసి పూర్తయ్యే లోపు మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ వచ్చేలా లేదు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.