TDP: ఏపీ రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తన బలం పెంచుకుంటూ వెళ్తోంది. వైసీపీకి ప్రత్యామ్నాయం తామే అని చూపించుకోవడం టీడీపీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఈ వ్యూహాలతో భాగంగానే ఇప్పుడు జనసేన పార్టీని కూడా తమ వైపుకి తిప్పుకున్నారు. వారు ఎన్ని సీట్లు డిమాండ్ చేసిన కూడా తాము ఇవ్వాలని అనుకున్న స్థానాలే జనసేనకి చంద్రబాబు ఇస్తారు. వ్యూహాలు, రాజకీయ చతురత వేయడంలో జనసేన కంటే చంద్రబాబు 10 ఆకులు ఎక్కువే చదివారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మెజారిటీ బట్టి ముఖ్యమంత్రి ఎవరుండాలి అనేది నిర్ణయించుకుంటాం.
టీడీపీ నాయకులని ముఖ్యమంత్రులు చేయడానికి పార్టీ పెట్టలేదు లాంటి పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్స్ పై చంద్రబాబు నిశితంగా దృష్టి పెట్టారు. తమపై పెత్తనం చేసే అవకాశం కాని, అలాగే ముఖ్యమంత్రి పీఠాన్ని డిమాండ్ చేసే ఛాన్స్ కాని పవన్ కళ్యాణ్ కి ఇవ్వకూడదు అని బాబు ఆలోచన చేస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తు తమకి ఇప్పుడు అవసరం, వారి బలం కలిస్తే అధికారంలోకి సులభంగా రావొచ్చు. అదే సమయంలో ఆ బలాన్ని కొంత వరకు మాత్రమే పరిమితం చేయడం ద్వారా, తరువాత పొత్తుకి దూరంపై ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా నష్టం ఉండదు.
అలా కాకుండా జనసేన అడుగుతున్నట్లు 45 నుంచి 50 స్థానాలు వారికి ఇస్తే తరువాత ఏకుమేకవుతారు. ఈ విషయంలో బాబు టీమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఏది ఏమైనా పొత్తు రెండు పార్టీలకి ఎంత లాభమో అంత నష్టం కూడా కలిగిస్తుందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఈ కూటమిలోకి బీజేపీకి కూడా వచ్చి చేరితే కనీసం వారు 10 స్థానాలు అయిన అడుగుతారు. ఎన్నికల తర్వాత గెలిచిన జనసేన, బీజేపీ వేరైతే టీడీపీ చిక్కుల్లో పడుతుంది. దీనిపై ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.