Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం భోళా శంకర్. తమన్నా హీరోయిన్‌గా కీర్తి సురేష్ మెగాస్టార్‌కి చెల్లిగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుసగా మాస్ ఎంటర్‌టైనర్స్‌ను లైన్‌లో పెట్టారు. వాటిలో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన సినిమా వాల్తేర్ వీరయ్య. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది.
అలాంటి హిట్ సినిమా తర్వాత వస్తున్న మూవీ భోళా శంకర్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెహర్ రమేష్ గతకొంతకాలంగా సినిమాలు చేయకపోయినా చిరు ఛాన్స్ ఇచ్చారు. ఆయనకి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. అందుకే, బాగా టైం తీసుకొని మరీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకూ వచ్చిన పోస్టర్ సినిమాపై బాగానే అంచనాలను పెంచాయి. కానీ, ఉగాది పండుగ సందర్భంగా వదిలిన కొత్త పోస్టర్ మాత్రం అంత ఆసక్తికరంగా లేదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
చిరు కమిటైన సినిమాలలో అన్నీ రిలీజైయ్యాయి. ఇక మిగిలింది భోళా శంకర్ మాత్రమే. అందుకే, అందరి చూపు ఈ సినిమాపై ఉంది. కానీ, తాజా పోస్టర్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అసలే కీర్తి సురేష్ కి గతకొంతకాలంగా హిట్స్ కరువయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కి చెల్లిగా నటించిన అణ్ణాత్త కూడా ఫ్లాపయింది. అదే సెంటిమెంట్ భోళా శంకర్ కి కంటిన్యూ అవుతుందా..? అని చెప్పుకుంటున్నారు. సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు మెగాస్టార్ చాలా చేశారు. వాటికి భిన్నంగా ఏముంటుందీ అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. మరి మెహర్ రమేష్ ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏం చెప్పబోతున్నారో చూడాలి. కథలో కొత్తదనం లేకపోతే మాత్రం సినిమా ప్రేక్షకులను చేరుకోవడం కష్టమే.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.