AR Rahman: మెగా 158 కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్ ఫిక్సైయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్ గారు భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, విక్టరీ వెంకటేష్ ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక, ఈ సినిమా తర్వాత చిరు, బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సమ్మర్ నుంచి సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక పీరియాడికల్ కథ అని కూడా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకముందు బాబీ..వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్‌కి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. దాంతో, మరోసారి ఇదే కాంబోలో సినిమా అనేసరికి అంచనాలు బాగానే మొదలయ్యాయి.
అయితే, ఇప్పుడు మెగా 158 సినిమాకి సంబందించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే, చిరు-బాబీ కాంబోలో మొదలయ్యే మెగా 158 చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్సైయ్యాడని. అతనెవరో కాదు, ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం రెహమాన్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్, ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి.
దీంతో రెహమాన్ చేతికి మెగా 158 బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీ హీరోలకి మ్యూజిక్ అందించే ఛాన్స్ అందుకున్న రెహమాన్‌కి టాలీవుడ్‌లో మరికొన్ని వరుస ఆఫర్స్ రావడం పక్కా అనుకోవచ్చు. మరి, దీనికి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటివరకూ చిరు సినిమాలకి మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, థమన్ సంగీతమందించారు. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు సినిమాకి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మెగా 158 కి ఛాన్స్ ఏఆర్ రెహమాన్ దక్కించుకుంటే నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఉండబోతుందనుకోవచ్చు.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.