Social Media: ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం సమాజంలో ఎక్కువ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా యాప్స్, వెబ్ సైట్స్ లు విపరీతంగా ప్రజలని ప్రభావితం చేస్తున్నాయి. మెజారిటీ ప్రజలు ట్విట్టర్, పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని వినియోగిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వారికి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ని వీటిలో షేర్ చేసుకుంటూ అందరితో పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వీటికి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగిన క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా అందరికి చేరువ అయిపోతుంది.
ఈ నేపధ్యంలోనే వీటికి ఎక్కువగా ప్రజలు అలవాటు పడిపోయారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ట్విట్టర్ షార్ట్ టెక్స్ట్ యాప్. ఇప్పుడు దీనిని రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు విస్తృతంగా తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ కారణంగా ట్విట్టర్ ఎక్కువ ఆదరణ ఉంది. ట్విట్టర్ లో కేవలం ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. ఫ్రెండ్స్ అనేది ఉండదు. అందుకే సెలబ్రిటీలు వీటిలో ఎక్కువగా ప్రోఫైల్స్ మెయింటేన్ చేస్తారు. ఇదిలా ఉంటే ఎలాన్ మాస్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా బ్లూక్ టిక్ మార్క్ కోసం డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. గతంలో ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారు అప్లై చేసుకుంటే బ్లూ టిక్ మార్క్ ఇచ్చేసావారు.
అయితే ఇప్పుడు బ్లూ టిక్ మార్క్ కావాలంటే ఏడాదికి 84 డాలర్లు చెల్లించాల్సిందే. ప్రస్తుతం పెయిడ్ బ్లూ టిక్ మార్క్ ట్విట్టర్ లో అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బ్లూ టిక్ మార్క్ ఉన్న వారి పోస్టులలో వచ్చే యాడ్స్ కోసం ఇప్పుడు డబ్బులు షేర్ చేసే వెసులుబాటుని యూజర్స్ కి అందించడానికి సిద్ధం అయ్యింది. ఇక ఫోటోస్, వీడియోలని అప్లోడ్ చేసుకునే సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ ఇప్పటికే యూజర్స్ ని ఉన్న ఫాలోవర్స్ బట్టి, వారి పోస్టులకి వచ్చే యాడ్స్ ఆధారంగా డబ్బులు అందిస్తుంది. ఈ కారణంగానే చాలా మంది హీరోయిన్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లక్షల రూపాయిలు ప్రతి నెల సంపాదిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా బ్లూ టిక్ మార్క్ సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి పేమెంట్ ఆప్షన్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో బ్లూ టిక్ మార్క్ కావాలని అనుకునే వారి నుంచి మినిమం రుసుము వసూలు చేయాలని మెటా సంస్థ భావిస్తుంది. త్వరలో దీనిని లైవ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ బ్లూ టిక్ మార్క్ పెయిడ్ సబ్ స్క్రైబ్ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్ తో పాటు పేస్ బుక్ కి కూడా వర్తింపజేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోవడంతో పాటు అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.