Devara- Part 1: “దేవర” చిత్రంపై కొరటాల, రాజమౌళి ప్రభావం..?

Devara- Part 1: ‘దేవర’ చిత్రంపై కొరటాల, రాజమౌళి ప్రభావం ఉంటుందా..? అంటే, గత కొన్ని రోజులుగా అవుననే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీనికి రెండు బలమైన కారణాలున్నాయి. ‘ఆచార్య’ చిత్రం కంటే ముందు వరకు దర్శకుడు కొరటాల శివ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ని అందుకున్నాయి. హీరోలకి భారీ సక్సెస్, నిర్మాతకి అనుకున్నదానికంటే రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టారు.

ప్రభాస్‌తో ‘మిర్చి’ మహేశ్ బాబుతో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ఎన్‌టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు. వీటి సక్సెస్ రేంజ్ ఏంటో చూసిన మెగాస్టార్ చిరంజీవి చరణ్‌తో సినిమా చేయాలని వెళ్ళిన కొరటాలకి నాతో తీయోచ్చుగా అని ఆఫర్ ఇచ్చారు. దాంతో ‘ఆచార్య’ మొదలైంది. అనూహ్యంగా ఇందులో మహేశ్ బాబు కూడా ఓ పాత్ర చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ, కొరటాల అనుకున్నట్టుగా చరణ్ ఇందులో భాగం అయ్యారు.

Devara- Part 1: “దేవర” చిత్రంపై కొరటాల, రాజమౌళి ప్రభావం..?

 

Devara- Part 1: ఈ సినిమాపై కొంత నెగిటివ్ టాక్..

మెగాస్టార్, మెగా పవర్ స్టార్, కొరటాల కాంబో అనగానే ఓ భారీ పాన్ ఇండియన్ సినిమాకి వచ్చినంత హైప్ వచ్చింది. కానీ, కారణాలేవైనప్పటికీ ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ కొరటాల.. ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ‘దేవర’ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

ఈ నెల 27న భారీ స్థాయిలో ‘దేవర’ పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. కాగా, ఈ సినిమాపై కొంత నెగిటివ్ టాక్ కూడా ప్రచారం అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో హిట్ కొట్టిన ఏ హీరోకైనా ఆ తర్వాత సినిమాతో ఫ్లాప్ మోయాల్సి వస్తుందని, అలాగే కొరటాల గత చిత్రం తాలూకా ప్రభావం ‘దేవర’పై కూడా ఉందని. మొదటి పాయింట్ కి చాలామంది న్యూట్రల్‌గా ఉన్నప్పటికీ రెండవ పాయింట్ కి మాత్రం ఎన్‌టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. చూడాలి మరి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దేవర’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో. అన్నట్టు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల తాకిడి తట్టుకోలేక రద్దైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తారక్ ఓ వీడియో రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…

4 days ago

This website uses cookies.