Keerthy Suresh : కీర్తి సురేష్..పర్ఫార్మెన్స్ పరంగా గొప్ప నటి అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ కమర్షియల్ హీరోయిన్‌గా మాత్రం ఇంకా నిలబడలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. చేయడానికి తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తోంది. మధ్యలో తన పెళ్లికి సంబంధించిన రూమర్స్ చాలా వచ్చినా కూడా వాటిని కాస్త పట్టించుకోలేదు. స్వయంగా తన తల్లిదండ్రులతోనే రూమర్స్‌కి క్లారిటీ ఇచ్చింది.
ఇక సినిమాల ఎంపిక విషయంలోనూ కీర్తికి చాలామంది ఎన్నో సలహాలిస్తున్నారు. మహానటి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కీర్తి అవార్డులను అందుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఒకటంటే ఒక్కటి కూడా హిట్ అందుకోలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపువుతుంటే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు.
అసలే హీరోయిన్స్ మధ్య పోటీ గట్టిగా ఉంది. సక్సెస్‌లలో లేని హీరోయిన్ డిమాండ్ చేస్తుందీ అంటే దర్శకనిర్మాతలు నెమ్మదిగా పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కీర్తిని టాలీవుడ్ మేకర్స్ పక్కన పెట్టేసినట్టే అనుకుంటున్నారు. ఎప్పుడో కమిటైన భోళా శంకర్, దసరా సినిమాలు తప్ప కొత్తవి ఏవీ అమ్మడు సైన్ చేయలేదట. ఒకవేళ తనవరకూ ఏదైనా అవకాశం వచ్చినా కూడా హీరో పెద్ద స్టార్ అయితేనే ఒప్పుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ధోరణిలోనే ఉంటే కీర్తిని మెల్లగా జనాలు మర్చిపోవాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.