Huma Qureshi : బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ బాలీవుడ్ నటి హుమా ఖురేషి సినిమాల్లో తన నాటనతోనే కాకుండా ఆమె సార్టోరియల్ ఫ్యాషన్ కి కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె వార్డ్‌రోబ్ పేజీ 3 విలువైన దుస్తులతో నిండిపోయింది. ఆ దుస్తులు ఫ్యాషన్‌వాదులు దృష్టిని అమితంగా ఆకర్షిస్తాయి . ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో స్టైలిష్ బ్లాక్ డ్రెస్‌లో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింటిలో వైరల్ అవుతున్నాయి.
హుమా ఖురేషి తన ఫోటో షూట్ కోసం ఫ్యాషన్ లేబుల్ జరా నుండి ఈ అందమైన డ్రెస్ ను ఎన్నుకుంది. అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆమె నగలను జరీన్ జ్యువెలరీ నుండి ఎంపిక చేసుకుంది.
హుమా ఖురేషి మల్టీ లేయర్డ్ గోల్డ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పాటు చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని తన రూపాన్ని అద్భుతంగా మార్చుకుంది హుమా. చూడటానికి కాస్త బొద్దుగా ఉన్నా ఈ బ్యూటీ పాలో అయ్యే ఫ్యాషన్స్ మాత్రం అందరికి తెగ నచ్చేస్తాయి. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో తన క్రేజ్ ను పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ తో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది 36 ఏళ్ల హుమా ఖురేషి. ఈ తరువాత హిందీ సినిమాల్లో అవకాశం వచ్చింది. చాలా వరకు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలపై కూడా ఆసక్తి చూపిస్తోంది.
ఈ బ్యూటీ ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన వలిమై లో, రజనీకాంత్ కాలా వంటి చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యూక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగు తెరపై ఈ బ్యూటీ కనిపించకపోయినా ఈ బ్యూటీకి ఈ సినిమాలతో కాస్త గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం, హుమా ఖురేషి తర్లా, పూజా మేరీ జాన్ సినిమాల విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
హుమా ఖురేషీ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటుంది. తరచుగా ఫాలోవర్స్‌ను పలకరిస్తుంటుంది. ఈ బ్యూటీకి సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కన్నా సోషల్ మీడియా ద్వారా వచ్చిందే ఎక్కువ అని చెప్పాలి. ఏ పిక్ పోస్ట్ చేసిన చాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో అమ్మడి హాట్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక్కో ఫోటోకు ఒక్కో పోజు ఇస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. తనదైన స్టైలిష్ అప్పీయరెన్స్ తో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.