శివ దర్శనం కోసం శివాలయంకు వెళ్లి వారు శివునికి ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు ఆలయం ముందుడే నంది చెవుల్లో తమ మనసులోని కోరిక చెప్పుకోకపోతే ఆ ప్రార్థనలు అంసంపూర్ణమని చెబుతున్నారు. శివునికి మంచి స్నేహితుడు, సహాయకుడైన నందికి శివాలయంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశం ఏదైనా విదేశాలైనా శివుని ఆలయం ముందు ఎద్దు రూపంలో ఉండే నంది కచ్చితంగా ఉంటాడు.
పరమేశ్వరుడిని భగవంతులకే భగవంతుడని అంటారు. అలాంటి శివునికి ఎంత ప్రాధాన్యత ఉంటూందో భక్తులు నందికి అంతే ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే నందిని శివునికి అత్యంత ఇష్టమైన భక్తుడిగా భావిస్తారు భక్తులు. పరమశివుడు ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉంటాడు. నంది మాత్రం తన కళ్లు చెవులు తెరిచి , ప్రతీది చూస్తూ అర్ధం చేసుకుంటాడు. ఎక్కువ సమయం ధ్యానంలో ఉండే శివుడు నంది చెప్పే ప్రతి విషయాన్ని వింటాడని భక్తుల విశ్వాసం.వీరిద్దరూ అత్యంత ఆత్మీయంగా ఉండాలని భక్తుల నమ్మకం. అందులోనూ ప్రతి భక్తుడు ధాన్యంలో ఉన్న పరమేశ్వరుడిని డిస్టర్బ్ యకూడదని నంది భావిస్తుంటాడు. అందుకే నంది భక్తుల బాధ్యతలను భుజానకెత్తుకుని వార సమస్యలు, ఇబ్బందులు, మొరలను వింటూ ఉంటాడు. శివుడు ధాన్యం నుంచి లేచి రాగానే నంది వెళ్లి భక్తుల సమస్యలను ఒక్కొక్కటిగా చెబుతుంటాడని పురాణాలు చెబుతున్నాయి. నందికి భక్తుల విషయంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎవ్వరైనా ఆయనకు సమానమే.
ఆలయాల్లో శివుని మందిరానికి సరిగ్గా ముందుగా నంది ఉంటాడు. శివుని దర్శనానికి వచ్చిన భక్తులు నంది వద్దకు వచ్చి వారి కోరికలను నంది చెవిలో చెప్పి ఆ తరువాత శివుని దర్శనానికి వెళతారు. ఆ శివుడే తమ సమస్యలను తీర్చుతాడని విశ్వాసంతో ఈ పని చేస్తారు. నంది ద్వారా వారి ప్రార్ధనలు విని తప్పక తమ కోరికలు నెరవేరుస్తాడన భక్తుల ప్రగాఢ విశ్వాసం. నంది కూడా తన ఈశ్వరుడికి తనను తాను అర్పించుకుంటాడు. మరి ఈసారి మీరు శివాలయంకు వెలితే తప్పక తమ సమస్యలు, మొరలను నంది చెవినవేస్తారని ఆశిస్తున్నాం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.