Health: మహిళలకి అందం అంతా వారి జుట్టులోనే ఉంటుంది. అలాగే వారు పెంచుకునే కురులను బట్టి వారి ఆహార్యం, వ్యక్తిత్వాన్ని కూడా చెప్పొచ్చు అని కొందరు అంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడవాళ్లు జుట్టు ఏపుగా పెంచుకోవడానికి ఇష్టపడతారు. సిటీలో ఉండే మహిళలు అయితే పొడవాటి జుట్టు పెంచుకున్న స్టైలిష్ గా లూజ్ హెయిర్ ని మెయింటేన్ చేస్తూ, కొత్త కొత్త లుక్స్ తో కనిపించడానికి ఇష్టపడతారు. అయితే మహిళలకి జుట్టు ఊడిపోతుంది అంటే వారికి ఎక్కడలేని టెన్షన్ వచ్చేస్తుంది.
ఓ విధంగా మహిళలలో ఈ జుట్టు ఊడిపోవడం అనేది ఆత్మన్యూనతకి కారణం అవుతుందని కూడా చాలా అధ్యయనాల్లో నిరూపితం అయ్యింది. స్త్రీలు చర్మ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో అంతకంటే ఎక్కువగా జుట్టుని సంరక్షించుకునే ప్రయత్నం చేస్తారు. వారి అందాన్ని రెట్టింపు చేసే జుట్టు అంటే ఓ విధంగా వారికి ప్రాణంతో సమానం అని చెప్పాలి. అయితే ఈ కాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా పెరిగిపోతున్న కాలుష్యం, ఎండలు, దుమ్ము, దూళి కారణంగా మహిళల్లో తరుచుగా జుట్టు ఊడిపోవడం జరుగుతుంది.
ఈ సమస్యని కంట్రోల్ చేసుకోవడానికి వారు మార్కెట్ లో లభించే అన్ని రకాల కాస్మొటిక్స్ వాడుతారు. అలాగే రకరకాల హెయిర్ ఆయిల్స్ కూడా వాడుతూ ఉంటారు. కొంత మంది హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయితే జుట్టు ఊడిపోవడం అనేది ఇప్పుడు బాగా ఎక్కువ అయ్యింది కానీ పూర్వకాలంలో మహిళలు ఎలాంటి కాస్మొటిక్స్ వాడకుండానే సహజసిద్ధం ఉత్పత్తులతోనే పొడవైన జుట్టు కలిగి ఉండేవారు. సహజంగా లభించే కుంకుడు కాయ, షీకాకాయలని దంచి వేడినీటిలో వాటిని వేసి ఆ నీటితో తలంటు పోసుకునే వారు.
అయితే ఇప్పుడు అవి చాలా వరకు కనుమరుగైపోయాయి. అయితే జుట్టు ఊడిపోకుండా నిగారింపుతో ఉంచుకోవడంతో పాటు, పొడవుగా పెంచుకోవడానికి అలోవెరా షాంపూలు ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. అయితే వీటిని హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా ఆకుల నుంచి జెల్ ని తీసుకోవాలి. ఒక పాన్ లో లో కొద్దిగా సబ్బు లేదా షాంపూని అది కరిగిపోయే వరకు వేడిచేయాలి. అందులో అలోవెరా జెల్ తో పాటు విటమిన్ ఈ, జొజోబా ఆయిల్ ని కలపడంతో షాంపూ రెడీ అయిపోతుంది. తలంటూ చేసుకునే సమయంలో ఈ షాంపూని బాగా షేక్ చేసి ఉపయోగించాలి. ఈ అలొవేరా షాంపూ తలలో దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్ ని దూరం చేస్తుంది. యాంటీ బాక్టీరియల్ పదార్ధాలు దురదని తగ్గిస్తాయి. అలాగే జుట్టుని మృదువుగా ఉంచుతుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.