Holi: మరికొద్ది రోజులలో హోలీ పండుగ రాబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ హోలీ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. హోలీ పండుగ రోజు రంగులను వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషకరంగా ఈ వేడుకను జరుపుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే హోలీ పండుగ రోజు పెద్ద ఎత్తున పూజలకు కూడా ప్రాధాన్యత కల్పిస్తారు. మరి హోలీ పండుగ రోజు ఏ ఏ దేవతలను ప్రత్యేకంగా పూజిస్తారనే విషయాన్ని వస్తే..
హోలీ పండుగ ఈ ఏడాది మార్చి 25వ తేదీ వచ్చింది. ఇతర పండుగల్లో మాదిరిగానే హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నింటిలో మొదటిది రంగు లేదా గులాల్ దేవునికి మొదటగా పూస్తారు. ఆ తర్వాత మాత్రమే హోలీని ఒకరికి ఒకరు రంగులను అడ్డుకుంటూ రంగుల కేళీ ఆడతారు. ఇలా హోలీ పండుగ రోజు దేవతలను పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. హోలీ పండుగ రోజు హనుమంతుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శారీరక, దైవిక, భౌతిక వేడి నుండి ఉపశమనం పొందుతారు. హోలీ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల జీవితాల్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. అదేవిధంగా ఆ పరమేశ్వరుడిని కూడా పూజిస్తారు.శివుడిని ఆరాధించడం ద్వారా అన్ని సమస్యల నుండి ఉపశమనం పొంది ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. రాధా-కృష్ణుల ఆరాధన లేకుండా హోలీ పండుగ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆరాధన కూడా ఎంతో ముఖ్యం హోలీ పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సిరిసంపదలకు లోటు ఉండదు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.