Balakrishna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ఆపరేషన్ జరిగింది. గత కొంతకాలంగా బాలయ్య కుడి భుజం నొప్పితో బాధ పడుతున్నారు. అయినా కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండటంతో ఆ సినిమా మీద ఫోకస్ పెట్టారు. ఇటీవలే అఖండ మూవీ షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే సెలబ్రిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానున్న ఈ షోలో మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, ఎన్.టి.ఆర్ లాంటి స్టార్స్ అంతా సందడి చేయనున్నారు. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో షోపై భారీ అంచనాలు పెంచేసింది. ఇలా బాలయ్య కొత్త జర్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇంతలోనే ఆయన భుజానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
నవంబర్ 1న బాలయ్యకు కేర్ హాస్పిటల్లో డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ బాలకృష్ణ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ ఆరు వారాలపాటు విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్లు చెప్పారు. కాగా బాలయ్య నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే అనిల్ రావిపూడి, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆయన సినిమాలు చేయనున్నారని సమాచారం.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
This website uses cookies.