Health Tips: ప్రస్తుత కాలంలో చాలామంది టాయిలెట్ ను తమ ప్రైవసీగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లి గంటలు తరబడి కూర్చొని న్యూస్ పేపర్లు చదవడం సెల్ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం జరుగుతుంది అయితే ఇలా ఎక్కువ సమయం పాటు టాయిలెట్లో కనుక కూర్చున్నారు అంటే తప్పకుండా మీరు అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎక్కువ సమయం టాయిలెట్ లోనే గడుపుతున్నారు. మరి ఇలా ఎక్కువ సమయం పాటు టాయిలెట్ లో ఉండటం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ఐదు నిమిషాల కన్నా టాయిలెట్లో ఎక్కువ సమయం గడిపితే కనుక తొందరగా ఇన్ఫెక్షన్ వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ సేపు సిటింగ్ లో కూర్చోవడం వల్ల ఫైల్స్ ఏర్పడే సమస్యలు కూడా ఉంటాయని బ్రిటన్ కి చెందిన టాప్స్ టైల్స్ కంపెనీ ఒక సర్వే తెలియజేసింది. ఇలా ఈ విషయంపై సర్వే చేయగా అక్కడ జనాలు వారానికి సగటున మూడున్నర గంటలు బాత్రూంలోనే గడుపుతున్నారని సర్వేలో తేలింది.
టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్లే పైల్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పాయువు లోపల రక్తనాళాలు ఎర్రబడి, ఒక ముద్దగా ఏర్పడినప్పుడు మూలశంక వ్యాధి వస్తుందని అందుకే ఐదు నిమిషాలకు మించి టాయిలెట్లో ఎక్కువ సమయం ఉండకూడదని నిపుణులు వెల్లడించారు. టాయిలెట్ సీట్ మీద కూర్చున్నప్పుడు పాయువు ప్రత్యేక స్థితిలో ఉంటుంది. దీని వల్ల దిగువ పురీషనాళంలోని సిరలపై అదనపు ఒత్తిడి ఏర్పడి ఫైల్స్ కు దారితీస్తుంది. అందుకే ఐదు నిమిషాలకు మించి టాయిలెట్ లో గడపకూడదని నిపుణులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.