Categories: Tips

Health – Papaya Leaves: బొప్పాయి ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలిస్తే..వెతికిమరీ తెచ్చుకుంటారు.

Health – Papaya Leaves: సాధారణంగా మనలో చాలామందికి పండిన పపాయ(బొప్పాయి పండు)ను తినడం మంచిదనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలకు ఎక్కువగా బొప్పాయి పండు తినమని చెబుతుంటారు. అందుకు కారణం పాలు బాగా ఉత్పత్తి అవుతాయని. ఇది నిజమే..తల్లికి పాలు బాగాపడి బిడ్డకు కావాల్సినంతగా పాలు అందుతాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, పచ్చి బొప్పాయిని కూరగా చేసి తినిపిస్తుంటారు. ఈ కూర బాలింతలే కాదు అందరూ తినవచ్చు.

బొప్పాయి పండును జూస్‌గా కూడా తయారు చేసి తీసుకుంటుంటారు. అయితే, బొప్పాయి ఆకువల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే, ఆ ఆకు వాసన కాస్త వెగటు పుట్టింది. అందుకే ఆకు జోలికి అంతగా వెళ్ళరు. కానీ, బొప్పాయి ఆకు వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుంటే మాత్రం బొప్పాయి చెట్టు ఎక్కడుందో అని వెతికి మరీ దీని ఆకులను తెచ్చుకుంటారు.

health-papaya-leaves-benifits-of-papaya-leaves

మన ఇంట్లో బొప్పాయి చెట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని మందులు మన వద్ద ఉన్నట్టే అనుకోవాలి. ఈ బొప్పాయి ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే, ఈ ఆకును ఎక్కువగా ఆయుర్వేదం మందుల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు, డెంగ్యూ వంటి వ్యాధులకు టాబ్లెట్ తయారీలోనూ బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగించే తయారు చేస్తారు. అంటే బొప్పాయి ఆకులను ఇంగ్లీషు మందుల తయారీలోనూ అధికంగా వాడతారని అర్థం.

Health – Papaya Leaves: పడిపోయిన ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా చాలామందిలో ప్లేట్ లెట్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో రోగి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. ఇలాంటి సయమలో త్వరగా ప్లేట్ లెట్ కౌంట్ పెరగాలంటే బొప్పాయి రసాన్ని రోజూ ఒక టీ స్పూన్ తాగాలి. అలాగే, డాక్టర్ల సూచన మేరకు బొప్పాయి ఆకులతో తయారు చేసిన టాబ్లెట్స్‌ను వాడాలి. దీనివల్ల పడిపోయిన ప్లేట్ లెట్ కౌంట్ మళ్ళీ త్వరగా పెరుగుతుంది.

ఇక మలేరియా జ్వరం వచ్చినా కూడా బొప్పాయి ఆకులను, దానితో తయారు చేసిన మందులను నయం కావడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు, క్యాన్సర్ రోగులకు బొప్పాయి ఆకులు వల్ల నయం అయే మార్గాలున్నాయి. చాలామందికి తలలో దురద వస్తుంటుంది. దీనికి చుండ్రు కూడా ఒక కారణం. జుట్టు సన్నబడిపోవడం, తరచుగా రాలిపోవడం లాంటి సమస్యలకు బొప్పాయి ఆకు మంచి నివారిణిగా పనిచేస్తుంది. ఈ ఆకు రసాన్ని తలకు పట్టించి కొద్దిసేపయ్యాక తలస్నానం చేసినట్టైతే ఈ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.

బొప్పాయి ఆకుల రసంలో ఉన్న ఔషధం మన శరీరంలోని ఇన్సులిన్‌ను బాగా ఉత్పత్తి చేస్తుంది. షుగర్ (చక్కెర వ్యాధి) ఉన్నవారికి బొప్పాయి రసం బాగా పనిచేస్తుంది. దీనివల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ వంటి పోషకాలు బొప్పాయి ఆకుల్లో అధికంగా ఉంటాయి. ఈ రసం తీసుకోవడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోదిక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలు బొప్పాయి ఆకులో ఉన్నాయి. కాబట్టి అందరూ ఇంట్లో బొప్పాయి మెక్కను నాటుకోండి. రోగాలకు మందు మీ ఇంట్లోనే లభిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.