Health care: ఇటీవల కాలంలో మనం తీసుకునే ఆహారంలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అందలేదని చెప్పాలి. ఇలా పోషక విలువలు తగ్గిపోవడంతో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే మన శరీరంలో ఎప్పుడైతే పోషకాలు తగ్గిపోతాయో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మరి పోషకాలు తగ్గిపోవటం వల్ల ఎలాంటి మార్పులు కనిపిస్తాయనే విషయానికి వస్తే..
తరచుగా పెదవులు, నాలుక, వేళ్లు మరియు పాదాలలో జలదరింపు, కండరాల నొప్పులు కాల్షియం లోపాన్ని సూచిస్తాయి. అలాగే శరీరంలో మెగ్నీషియం కంటెంట్ తగ్గినప్పుడు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, అలసట, బలహీనత, చేతులు మరియు కాళ్లలో తిమ్మిరి, అరచేతులు చల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక చర్మం మొత్తం పగుళ్లు ఏర్పడటం లేదా దద్దుర్లు రావడం జుట్టు ఎక్కువగా రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలకు జింక్ లోపమే కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇక తరచూ తలనొప్పి గుండె దడ పెరగడం తల తిరగడం చిన్న పనులకే అలసిపోవడం వంటివి జరుగుతూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే మన శరీరానికి కావాల్సినంత ఐరన్ లభించలేదని అర్థం. ఎప్పుడైతే విటమిన్ సి లోపిస్తుందో ఆ సమయంలో కీళ్ల నొప్పులు, బలహీనత, చిరాకు, చర్మంపై ఎరుపు లేదా నీలం రంగు మచ్చలు రావడం, జుట్టు పొడిగా పెళుసుగా మారడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే మీకు పోషకాహార లోపం తక్కువైందని తద్వారా పోషక విలువల కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలుస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.