Health care: ఇటీవల కాలంలో ఎంతోమంది మద్యం తాగే అలవాటు చేసుకున్నారు ఇప్పుడు మద్యం తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది ఏ ఈవెంట్ కి వెళ్లిన తప్పనిసరిగా ఆడ మగ అనే తేడా లేకుండా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. అయితే ఇలా ఆల్కహాల్ తీసుకునేవారు ఎక్కువగా మద్యం తాగుతూ మరోవైపు మందు తింటూ ఉంటారు. అయితే ఇలా ఒకేసారి రెండు తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రమాదాలు ఏర్పడతాయని ఇలా మందు తాగే వారు నాన్ వెజ్ అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మందుతో పాటు మాంసం అసలు తీసుకోకూడదు ఇలా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందనే విషయానికి వస్తే.. ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇది జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ , అతిసారం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మద్యం కాలేయానికి హాని కలిగిస్తుంది. నాన్ వెజ్ ప్రోటీన్ ను జీర్ణించుకోవడానికి కాలేయం అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఇది కాలేయంపై ఒత్తిడిని పెంచి, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం ఎక్కువ కొవ్వు గల నాన్ వెజ్ ఆహారాలు కలిసి హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మన శరీరంలో అధిక మొత్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకు పోవడానికి కారణం అవుతుంది తద్వారా రక్త ప్రసరణ పై ప్రభావం చూపడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కూడా కారణమవుతాయి.ఇవి మద్యంతో కలిసి కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. మద్యం, నాన్ వెజ్ ఈ రెండూ శరీరాన్ని ఆయాసపరుస్తాయట. ఇది శక్తి స్థాయిలను తగ్గించి, నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రెండింటినీ కలిపి అసలు తీసుకోకూడదు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.