Boda Kakara: సాధారణ కాకరకాయ కంటే అధిక రెట్లు ఔషధ గుణాలు కలిగి ఉన్న బోడ కాకరకాయను ఆహారంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోడ కాకరను బొంత కాకర, అగాకర, అడవి కాకర అనే పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు. బొంత కాకర మార్కెట్లో ఖరీదైనప్పటికీ వీటిని ఆహారంగా తీసుకుంటే అనేక దీర్ఘకాలిక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువగా ఉన్న బోడ కాకర సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బోడ కాకరలో విటమిన్ సి, విటమిన్ ఏ ,విటమిన్ డి , విటమిన్ బీ 12, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను, అలర్జీలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది.
బోడ కాకరలో సమృద్ధిగా ఉన్న లూటీన్ వంటి కెరోటినాయిడ్స్ అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడి హృదయ సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, కంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.
బోడ కాకరకాయలు పోలెట్ అధికంగా ఉంటుంది ఇది శరీర కణాల ఎదుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భస్థ శిశువు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. బోడ కాకరలో సమృద్ధిగా ఉన్న పీచు పదార్థం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబందకం, అజీర్తి , గ్యాస్టిక్ సమస్యలను తొలగిస్తుంది..బోడ కాకర డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ కాకరకాయ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కువగా…
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు, సినీ ప్రేమికులు ఎంతో…
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
This website uses cookies.