Categories: Health

Health Tips: పరగడుపున టీ తాగుతున్నారా… మీకు ఈ సమస్యలు తప్పవు..?

Health Tips: సాధారణంగా ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది. ఇలా ఉదయం లేవగానే కాఫీ టీ తాగకపోతే కొంతమందికి ఆ రోజు మొదలవదు. ఇలా ఎంతోమంది కాఫీ టీ లకు బాగా అలవాటు పడి ఉదయం లేవగానే వాటిని తాగకపోతే రోజు మొత్తం చిరాకుగా ఉంటారు. అయితే ఇలా ఉదయం లేవగానే పరగడుపున కాఫీ, టీ వంటివి తాగటం చాలా పొరపాటని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ, టీ తాగాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలని చెబుతున్నారు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం..

ఉదయాన్నే టీ తాగడం వల్ల పండ్లలో ఉండే ఎనామిల్ దెబ్బ తింటుందని చెబుతున్నారు. పరగడుపున టీ తాగడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో టీ తాగితే అనారోగ్యమే. ఖాళీ కడుపుతో టీ తాగితే పేగులలో పొర ఏర్పడుతుంది. అంతకుముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి. టీ పరగడుపున తాగితే నష్టాలే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరగడుపున టీ తాగడం మంచిది కాదు.

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు మొదలవుతాయి. ప్రతీ రోజు ఇలా కాళీ కడుపుతో టీ కాఫీలు తాగడం వల్ల  పొట్టలో ఆమ్లం పెరిగి ఆరోగ్యం చెడిపోతుంది. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల దంతాల బయటి పొర క్షీణించి దంతక్షయం ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరం డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇలా ఉదయం లేవగానే టీ కాఫీలు తాగటం వల్ల కళ్ళు తిరగటం గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి.

అందువల్ల ఉదయం లేచిన వెంటనే ఒకేసారి కాఫీ టీ తాగకుండా ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. కాఫీ టీ తాగటానికి 10 ,15 నిమిషాల ముందు ఇలా గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల గ్యాస్టిక్, ఎసిడిటీ వంటి సమస్యల దరి చేయడమే కాకుండా కాఫీ,టీ లు తాగటం వల్ల కూడా ఎటువంటి సమస్య తలెత్తదు. అలాగే కాఫీ టీ తాగేటప్పుడు దానితోపాటు ఏదైనా ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గ్యాస్, మలబద్ధకం కడుపునొప్పి వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఉదయం గోరువెచ్చని నీరు తాగిన తర్వాత కాఫీ టీలు తాగటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago