Guppedantha manasu serial: జగతి, మహింద్ర రిషి బెడ్రూంలో ఎదురు చూస్తారు. రిషి రాగానే ఏదో పెద్ద విషయమే అయి ఉంటుంది చెప్పండి అంటాడు. వసుని నువ్ అవయిడ్ చేస్తున్నట్టనిపిస్తుంది అంటాడు మహింద్ర. మీకేం అనిపిస్తుంది మేడం అని జగతిని అడుగుతాడు. అపార్థాలు తొలిగిపోయాయి కదా.. ఇంకెందుకు వసుని దూరం పెడుతున్నావని అంటాడు మహింద్ర. మీరు ముగ్గురు నా ఎమోషన్స్‌తో ఆడుకున్నారని కోపంగా అంటాడు. అలా వాళ్ల మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. వసు పెళ్లి గురించి నిజం చెప్పనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు రిషి.
వసుని క్షమించమని అడుగుతాడు మహింద్ర. తనని క్షమించలేను.. అలా అని దూరం పెట్టలేకపోతున్నా.. మీరనుకున్నది జరగదు డాడ్ అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి. ఈ కోపం ఎన్నాళ్లో అనుకుంటూ బాధపడతారు జగతి, మహింద్రలు. అపుడే దేవయాని తమ మాటల్ని చాటుగా వింటుంది. మహింద్ర కావాలని రిషి మాట తీరులో మార్పు కనిపించిందా? వదినా గారు అంటాడు దేవయానితో. కాని నేనేం వినలేదని తప్పించుకుంటుంది దేవయాని.
Guppedantha manasu serial: సీన్ కట్ చేస్తే.. వసు, రిషిలు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటారు. వసు పడుకున్నారా సర్ అని మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు చాటింగ్ నడుస్తుంది. వసు మీద కాస్త కోపంతోనే మెసేజ్ చేస్తాడు రిషి. ఆ తర్వాత మార్నింగ్ కాల్ చేస్తా వసుధార అని చెప్పి పడుకుంటాడు రిషి.
మరుసటి రోజు ఉదయం.. రిషి నిద్ర లేవకుండా అలాగే పడుకుంటాడు. మహింద్ర రిషిని చూసి ఇంకా లేవకపోవడమేంటని వెళ్లి చూస్తే ఒళ్లంతా కాలిపోతుంది. అపుడే వసుధార ఫోన్ చేస్తుంది. వసుకు విషయం చెప్తాడు మహింద్ర. డాక్టర్‌కు కాల్ చేస్తాడు. దేవయాని మాత్రం అదే అదనుగా జగతి, మహింద్ర మీద అరుస్తుంది. అపుడే వసు వచ్చి కంగారు పడుతుంది. రిషి పక్కన కూర్చున్న దేవయానితో మేడం లేవండి అంటూ లేపుతుంది. రిషి ఒళ్లు కాలడం చూసి ఆందోళన చెందుతుంది. తడిబట్టతో ఒళ్తు తుడుస్తూ దేవయానిని ఇన్‌డైరెక్ట్‌గా తిడుతుంది. రిషి సార్‌ని నేను చూసుకుంటా మీరు వెళ్లండని తేల్చి చెప్తుంది. పాలు వేడి చేసి ప్లాస్క్లో పంపించమని దేవయానికే ఆర్డర్ వేస్తుంది. ఆ తర్వాత రిషిని చూస్తూ వసు బాధపడుతుంది.
సీన్ కట్ చేస్తే.. జగతి మీద అరుస్తుంది దేవయాని. పరాయి ఆడపిల్లకి కొడుకుని వదిలేసి రావడమేంటని నిలదీస్తుంది. వాళ్లకి త్వరలో పెళ్లి చేస్తాం కద వదిన అని చెప్తాడు మహింద్ర. కానీ దేవయాని మాత్రం అదేం వినకుండా ఇద్దరి మీదికి అరుస్తుంది. వాళ్లు ఇద్దరూ ఒకటి కావాలని మీరు కోరుకుంటే జరగదు.. నేను కోరుకోవాలని అంటుంంది దేవయాని. దాంతో జగతి కూడా దేవయానికి ఓ రేంజ్‌లో సవాల్ విసురుతుంది. భయంతో పారిపోతుంది దేవయాని అక్కడినుంచి.యఅక్కడ వసు మాత్రం రిషిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. టైంకి ట్యాబ్లెట్స్ వేస్తుంది.
రిషి పక్కన అలిసిపోయి వసు కూడా అలానే నిద్రపోతుంది. రిషికి మెళుకువ వచ్చి చూస్తూ వసు చేయి తన గుండెల మీద ఉంటుంది. చేయి పక్కకు జరిపి లేచి కూర్చుంటాడు రిషి. నైట్ అంతా ఇక్కడే ఉన్నావా వసుధార. థ్యాంక్స్ అంటాడు రిషి. అదే అదనుగా వసు తన ప్రేమనంతా వెలిబుచ్చుతుంది. అపుడే దేవయాని మహింద్రలు వస్తారు. రిషి సార్‌కి జ్వరం తగ్గింది నేను వెళ్లి కాఫీ తీసుకొస్తానంటుంది వసు. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.