Guppedantha manasu serial: వసు మెడలో తాళికి నువ్ కారణం కాదని చెప్పు రిషి అంటూ దబాయిస్తుంది దేవయాని. దాంతో అందరిలో ఉత్కంఠ నెలకొంటుంది. రిషి వెళ్లి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ‘జగతి మేడం చెప్పిన మాటలన్నీ నిజం’ అంటాడు రిషి. దాంతో దేవయాని తప్ప అందరూ హ్యాపీగా ఫీలవుతారు. రిషి ఏం మాట్లాడుతున్నావ్ అని దేవయాని అడగ్గా.. నిజమే పెద్దమ్మ అంటాడు. ఈ ప్రెస్‌మీట్ పర్సనల్ విషయాలు చర్చించడానికి కాదు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి వసుధార వివరిస్తారని చెప్పి వెళ్లిపోతాడు రిషి. పెద్దమ్మ అంటూ దేవయానిని వెతుకుతూ వెళ్తాడు రిషి. అలా వెళ్తున్నారేంటి పెద్దమ్మ అని అడగ్గా.. ఈ పెద్దమ్మ కొంచెం సేపటి క్రితమే చనిపోయింది అంటూ రిషి పెళ్లి గురించి అరుస్తుంది. ఇక నాతో నీకు పనేంటి అంటూ బాధపడుతన్నట్టు నటిస్తుంది దేవయాని. మీకంటే నాకు ఈ లోకంలో ఎవరూ ఎక్కువ కాదు. నన్ను దూరం పెట్టకండి పెద్దమ్మ అని అడుగుతాడు. ఫణింద్ర రావడం చూసి రూట్ మారుస్తుంది దేవయాని. నీ సంతోషమే నా సంతోషమంటూ మాటలు చెప్తుంది.
సీన్ కట్ చేస్తే.. వసు రిషి క్యాబిన్‌కి వెళ్లి వెతుకుతుంది. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అనుకుంటుంది మనసులో. రిషి కుర్చీలో కూర్చుని తన భావాల్ని బయటికి చెప్పుకుంటుంది. టేబుల్ మీద ఉన్న హార్ట్ తీసుకుని ఎండీ అనుకుంటూ మాట్లాడుతుంది. వసుధారకు నేనే భర్తనని చెప్పారు రిషి సార్ అంటూ ఆనందంతో గెంతులు వేస్తుంది. తన చేతిలో ఉన్న హార్ట్ కింద పడబోతుంటే వసునే పట్టుకుంటుంది. ఏంటి ఈ ఆనందం అని రిషి అడగ్గా.. మన మధ్య ఉన్న సంఘర్షణకి ఈ రోజు తెరపడిందని అంటుంది వసు. నేను నీకు భర్తననని చెప్పాను కానీ నువ్ నా భార్యవని చెప్పలేదు కదా అంటాడు రిషి. దాంతో అయోమయంలో పడుతుంది వసు. అలా ఎలా అవుతుంది సర్ అని అడగ్గా.. నేను చెప్పిందాంట్లో తప్పేముంది అని సమర్థించుకుంటాడు రిషి.
Guppedantha manasu serial: నీ వైపున మనస్ఫూర్తిగా తాళి నీ మెడలో పడింది. అది నీ ఇష్టపూర్వకంగా జరిగింది. నీ ఊహల్లో నేను నీకు భర్తనయ్యానని అంటాడు రిషి. అందరిలో మీరు నా భర్తనని ఒప్పుకున్నారు మళ్లీ ఇదేం లాజిక్ సర్ అంటుంది వసు. నీ అంతట నువ్వే తాళి కట్టుకుంటే నేను నీకు భర్తనెలా అవుతాను చెప్పు. అసలు పెళ్లి అంటే ఎన్నెన్నో ఊహించుకున్నాను. కానీ నువ్ నా ప్రేమను అపహాస్యం చేశావ్ అంటాడు. తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది సర్ అంటుంది వసు. నలుగురిలో నువ్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినపుడు నా బాధను నీ బాధగా భావించాను అంటాడు రిషి. అది నిజం కాదా సర్ అంటుంది వసు. నాకు తెలియకుండానే నువ్ నన్ను భర్తని చేసుకున్నావ్ అని రిషి అనగా ఇది కరెక్ట్ కాదు సర్ అంటుంది వసు. నేను మీ భార్యని ఎలా కాదు సర్ అని ప్రశ్నిస్తుంది వసు. దాంతో ఏవేవో చెప్తాడు రిషి. మన మన అంటూ మనమిద్దరం సర్. మళ్లీ ఆ పదానికి కొత్త అర్థం చెప్తారేమో. రిషిధార అంటే మనం అనుకున్నా. రిషిధారల మధ్య కనిపించని దూరమేదో ఉందని అంటుంది వసు. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది వసుధార అంటాడు రిషి. దాంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.