Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: లగేజ్‌తో అత్తారింట్లో అడుగుపెట్టి వసు.. తనని అలా చూసి దేవయాని మైండ్ బ్లాక్!

Guppedantha manasu serial: మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్‌ని వసుకు ఇస్తాడు రిషి. అన్నీ నాకే ఇస్తే ఎలా సర్ మీరు ఉంచుకోండి అని వసు అనగా.. నాకు గాయాలు ఉన్నాయి కదా వసుధార అంటూ బాధగా వెళ్లిపోతాడు రిషి. ఇదంతా చక్రపాణి దూరం నుంచి గమనిస్తాడు. ఆ తర్వాత రిషి కారు ఇంటి ముందు ఆగుతుంది. సీటులో పడిపోయిన మల్లెపువ్వుల్ని చూసి వసు మాటల్ని గుర్తుచేసుకుంటాడు. అంతలోనే వసు మెసేజ్ చేస్తుంది రిషికి. రిషి కూడా వసుతో చాట్ చేస్తాడు. మెసేజ్‌లో కూడా రిషి తన బాధని చెప్పుకుంటాడు. వసు తన మెడలో ఉన్న రెండక్షరాలని చూసుకుంటూ బాధపడుతుంది. గుడ్ డే ఎండీ గారు అని మెసేజ్ పెట్టి పడుకుంటుంది.

సీన్ కట్ చేస్తే.. దేవయాని కాఫీ కోసం ధరణిని పిలుస్తుంది. అంతలోనే ఫణింద్ర వచ్చి ఏంటి దేవయాని రుసరుసలాడుతున్నావని అడుగుతాడు. అంతలోనే మహింద్ర వచ్చి ధరణిని కాస్త సరదాగా మందలిస్తాడు. అపుడే డోర్ కాలింగ్ బెల్ మోగుతుంది. పాలు వచ్చాయని ధరణి అనగా నేను వెళ్తా అంటూ డోర్ తెరుస్తుంది దేవయాని. చక్రపాణిని చూసి కంగుతింటుంది. ఎవరు అంటూ ఫణింద్ర అడగ్గా.. నోరు మెదపకుండా ఉండిపోతుంది. అపుడే రామ్మా అంటూ వసుని పిలుస్తాడు చక్రపాణి. బ్యాగ్‌తో వచ్చిన వసుని చూసి కొందరు ఆశ్చర్యపోగా.. ఇంకొందరు సంబరపడతారు.

Guppedantha manasu serial: vasudhara at rishis house
Guppedantha manasu serial: vasudhara at rishis house

చక్రపాణి అందర్ని వరుసలు పెట్టి పిలవడంతో దేవయాని అతన్ని మందలిస్తుంది. వసుధార ఈ ఇంటి కోడలు అయినపుడు మీరు అక్కయ్యనే అవుతారు కదా అంటాడు. రిషి సార్ అందరిముందు నా కూతుర్ని భార్య అని ఒప్పుకున్నాక.. ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కద అక్కయ్య. అందుకే మీ కోడల్ని మీకు అప్పగిస్తున్నాను అంటాడు చక్రపాణి. కుడి కాలు లోపల పెట్టి వెళ్లమ్మ అని వసుకు సూచిస్తాడు. వసు లోపల అడుగుపెడుతుండగా ఏయ్ ఆగు అంటూ అరుస్తుంది దేవయాని.

ఆ తర్వాత చక్రపాణిని మందలిస్తుంది. తనకు ఏ అధికారం ఉందని ఇక్కడ ఉంటుందంటూ ప్రశ్నిస్తుంది. తన మెడలో ఉన్న తాళి తీసి చూపిస్తుంది వసు. నేను వెళ్లొస్తా అని కూతురికి జాగ్రత్తలు చెప్పి బయల్దేరతాడు చక్రపాణి. రిషి సర్ ఇంకా లేవలేదా అని ధరణిని అడిగుతుంది. అంతలోనే పాలు వస్తే మీరు పాలు కాచండి నేను దేవుడికి దండం పెట్టుకుంటానని వెళ్తుంది వసు.

సీన్ కట్ చేస్తే.. వసు సడెన్‌గా ఏంటిది అని అడుగుతారు జగతి, మహింద్రలు. నాన్న ఒక మాట అన్నారు అందుకే వచ్చానని బదులిస్తుంది వసు. దాంతో వసుకు ధైర్యం చెప్తారు అత్త, మామ. ఆల్ ది బెస్ట్ చెప్తారు. అక్కడ ధరణి మీద దేవయాని మండిపడుతుంది. వసుని ఏం చేయాలో నాకు బాగా తెలుసని తెగింపుగా మాట్లాడుతుంది.

రిషి నిద్ర లేవనియ్ చెప్తా సంగతి అంటూ బెదిరిస్తుంది. వసు రావడంలో జగతి, మహింద్రల పాత్ర ఉందని ఆడిపోసుకుంటుంది. పొద్దున్నే ఏంటి ఈ దరిద్రం అంటూ కసురుకుంటుంది. అంతలోనే వసు ఎంట్రీ ఇస్తుంది. దేవయాని మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది వసు. ఈ ఇంట్లో నా స్థానమేంటో తెలుసని చెప్తుంది. దానికి ధరణి సహాయం కూడా తీసుకుంటుంది. కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టిన వసుధారని రిషి అంగీకరిస్తాడో లేదో చూడాలి మరి.

Savitha S

Recent Posts

Pawan Kalyan: అన్నీ వరుసబెట్టి పూర్తి చేస్తున్న పవర్ స్టార్..!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కువగా…

8 hours ago

The Raja Saab: ఫ్రభాస్ వల్లే ఆలస్యమవుతుందా..?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు, సినీ ప్రేమికులు ఎంతో…

9 hours ago

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

1 week ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

4 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

1 month ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

1 month ago