Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషిధారలు టూర్‌కు వెళ్లి కిట్లను పంచుతారు. ఆ తర్వాత ధర్మయ్య ఇంటికి కొత్త దంపతులుగా భోజనానికి వెళ్తారు. తిరిగి వచ్చే సమయంలో మినిస్టర్‌ని కలుస్తారు. వసుకు మినిస్టర్ పెళ్లి గిఫ్ట్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది నేటి ఎపిసోడ్ లో చూద్దాం..
మినిస్టర్ వసుని తన భర్తతో కలిసి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. రిషి సార్‌కి మీ ఆయన్ని పరిచయం చేశావా అని అడగ్గా.. లేదు సర్ ఆ రోజు త్వరలోనే వస్తుంది అంటుంది వసు. నిన్ను పెళ్లి చేసుకున్న ఆ అదృష్టవంతుడ్ని నాకు చూడాలని ఉందమ్మా అంటాడు మినిస్టర్. తను నాకు దొరకడం అదృష్టం అంటుంది వసు రిషిని చూస్తూ. రిషి మనసులో కోపంతో రగిలిపోతాడు. వెళ్దామా ఇక అంటాడు వసుతో. అలా అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోతారు ఇద్దరూ.
Guppedantha manasu serial: సీన్ కట్ చేస్తే.. రిషిధారల గురించి ఆలోచిస్తుంటారు మహింద్ర, జగతి. రిషికి ఫోన్ చేస్తా అంటే వద్దని ఆపుతుంది జగతి. అపుడే కారులో వెళ్తూ వసు మినిస్టర్ ఇచ్చిన చీరను పైనుంచి వేసుకుని ఎలా ఉంది సర్ అని అడుగుతుంది రిషిని. రిషి కోపంగా కారు పక్కన ఆపి నిల్చుంటాడు. ‘ఏమనుకుంటున్నావ్ నువ్వు’ అని కోపంగా అరుస్తాడు వసు మీదికి. దేని గురించి మాట్లాడుతున్నారు సర్ అంటుంది వసు. నీ మెడలో ఉన్న తాళి గురించి.. అంటాడు రిషి. జరిగిందంతా గుర్తుచేసుకుంటూ బాధపడతాడు రిషి. నా జీవితంతో ఆడుకుంటున్నావ్ అని అరుస్తాడు. అసలు నిజమేంటి వసుధార? చెప్పు అని నిలదీస్తాడు. నీ మెడలో తాళి కట్టింది ఎవరు? నీ ప్రేమ అబద్ధమా? నువ్ అబద్ధమా? అంటూ కోపంతో ఊగిపోతాడు. ఎవడు వాడు చెప్పు? అంటూ అడుగుతాడు. గతంలో ఇద్దరి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారాన్నంత గుర్తు చేసుకుంటూ బాధపడతాడు రిషి. ఇపుడు ఏమంటారు సర్ అని వసు అడగ్గా.. నా పర్సనల్ లైఫ్‌లోకి ఎందుకొచ్చావ్? ఎందుకు నన్ను బాధపెడుతున్నావ్? ఇదంతా నీ ప్లానా? అని ప్రశ్నిస్తాడు. నాకు ప్లాన్స్ వేయడం రాదు సర్ అంటుంది వసు. మరెందుకు రంగులు మారుస్తున్నావ్? నాకు చెప్పి తీరాలి వసుధార అని గట్టిగా నిలదీస్తాడు.
నేను చెప్పను సర్.. నేను చెప్పను అంటూ అదే స్థాయిలో రిప్లై ఇస్తుంది వసు. నన్ను ఇన్ని మాటలు అన్నారు. నా గురించి ఇన్ని తెలుసుకున్న వాళ్లు ఇది కూడా తెలుసుకోండి. ప్రేమగా అడిగితే చెప్పేదాన్నేమో అంటూ వెళ్లిపోతుంది వసు. ఒక్కమాట గుర్తుపెట్టుకోండి రిషిసార్. నా మెడలో తాళి కట్టడానికి కారణమైన వాళ్లకి తెలిస్తే ఊరుకోరు అంటూ హెచ్చరిస్తుంది వసు. ఆ తర్వాత ఆటోలో వెళ్లిపోతుంది వసు.
వసు మాటల్ని తలుచుకుంటూ బాధపడతాడు రిషి. నేనేం తప్పుగా మాట్లాడాను. ఎవడు వాడు అనడం తప్పా. నా బాధ. నా జీవితం. తనకేం పట్టవా? అనుకుంటాడు లోపల. అక్కడ జగతి, మహింద్రలు వసురిషిల మధ్య ఏం జరిగిందోనని తెగ ఆలోచిస్తుంటారు. అపుడే జగతికి మినిస్టర్ కాల్ చేసి వసురిషి చెప్పిందాని గురించి మాట్లాడతాడు. మీ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ బాగా నచ్చిందని థ్యాంక్స్ చెప్తాడు మినిస్టర్. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వసుకు ఫోన్ చేయాల్సిందేనని.. ఫోన్ చేస్తుంది జగతి. ఎక్కడున్నావ్ వసు.. రిషి ఉన్నాడ పక్కన అని అడుగుతుంది. జరిగిందంతా మనసులో పెట్టుకుని ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడుతుంది వసు. మా అబ్బాయి చాలా మంచోడు. మీ ఎండీ గారికే కొంచెం కోపమంటుంది జగతి.
ఏం జరిగింది వసు అని అడగ్గా.. యుద్ధాలే జరుగుతున్నాయి మేడం. మా ఆయన గురించి కూపీ లాగడానికి ఆయన్ని ఆయనే తిట్టుకుంటున్నాడు అంటుంది వసు. ఈ రోజు నీ బాషలో మంచి తెలుగు పదాలు దొర్లుతున్నాయేంటి వసు అని అడగ్గా.. వసు తింగరగా సమాధానమిస్తుంది. అక్కడ రిషి.. తను చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? అంటూ శపథం చేసుకుంటాడు. మరి రిషి నిజం ఎలా తెలుసుకుంటాడో తర్వాత ఎపిసోడ్‌లో చూద్దాం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.