Guppedantha manasu serial: రిషి ఫ్యూచర్ గురించి ఆలోచించాలని చెప్తుంది దేవయాని భర్తతో. నువ్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కొట్టిపారేస్తాడు ఫణింద్ర. రిషి, వసుల మధ్య మనం జోక్యం చేసుకోకూడదు అంటాడు. అపుడే మహింద్ర వచ్చి అడగ్గా.. ఏం లేదు నా బాధలేవో నేను చెప్పుకుంటున్నాను అంటుంది దేవయాని. రిషి వచ్చాడా అని అడగ్గా ఇంకా రాలేదు అక్క అంటుంది జగతి. ఇది వీళ్ల పద్ధతి. రిషిని వీళ్లు పట్టించుకోరు నన్ను పట్టించుకోనివ్వరు అంటుంది దేవయాని. రిషి ఎక్కడికి వెళ్లాడో నాకు తెలుసు అనుకుంటూ వెల్లిపోతుంది దేవయాని.
సీన్ కట్ చేస్తే.. వసు కోసం ఎదురు చూస్తాడు రిషి. అంతలోనే వసు డ్రెస్‌లో వచ్చి వెళ్దామా సర్ అంటుంది. రిషి అది చూసి ఏంటిది నేను బయటికి వెళ్దాం అన్నపుడు మంచి డ్రెస్ ప్లాన్ చేసుకోవచ్చు కద అంటాడు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్తే ప్లాన్ చేసుకుంటాం కద సర్ అంటుంది వసు. నాకు డ్రెస్ నచ్చలేదు వెళ్లి మార్చుకోనిరా నేను కారులో వెయిట్ చేస్తా అంటాడు రిషి. ఏంటో రిషి సర్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు అనుకుంటుంది మనసులో.
Guppedantha manasu serial: ఆ తర్వాత వసు జగతికి ఫోన్ చేసి రిషి మీద కంప్లైంట్ ఇస్తుంది. త్వరగా రమ్మని ఇబ్బంది పెడుతున్నాడని చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నారని జగతి అడగ్గా.. నాకు తెలిస్తే మీకు ఎందుకు ఫోన్ చేస్తా అంటుంది వసు. రిషి నిన్ను శాసిస్తున్నాడంటే నీ మీద ప్రేమ ఉన్నట్లే కదా అంటుంది జగతి. నువ్ కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని వసుకు హితబోధ చేస్తుంది జగతి. దాంతో వసు కూల్ అవుతుంది. ఆలస్యమైతే మా ఎండీ గారు అరుస్తారు మేడం అని ఫోన్ పెట్టేసి రెడీ అవుతుంది. చీర కట్టుకుని బుట్టబొమ్మలా తయారైన వసుని చూస్తూ అలానే ఉండిపోతాడు రిషి. ఆ మౌనం నుంచి వసు తేరుకుని సర్ వెళ్దామా అంటుంది. ఊ అంటాడు రిషి. ఎక్కడికి వెళ్తున్నాం సర్ అని అడగ్గా రిషి ఏం చెప్పడు. ఈ చీరని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటాడు రిషి. ఈ చీర నా పెళ్లికి వచ్చిన అపురూపమైన కానుక అంటుంది వసు. ఆ తర్వాత ఇద్దరూ బయల్దేరతారు.
కారులో వెళ్తుండగా.. ఈ తాళిబొట్టు చూస్తున్నప్పుడు ఏమనుకుంటున్నాడో అడుగుదాం అనుకుంటుంది మనసులో. కానీ రిషి ఆ అవకాశం ఇవ్వడు. ఆ తర్వాత జగతి, మహింద్రలు రిషి, వసులు ఎక్కడికి వెళ్లారోనని ఆలోచిస్తారు. మహింద్ర రిషికి ఫోన్ చేయబోతుంటే వద్దంటుంది జగతి. అంతలోనే ధరణి వచ్చి కాఫీ తీసుకురావాలా అని అడుగుతుంది. కానీ మహింద్ర మాత్రం ఏదో ఏదో మాట్లాడతాడు. ఆ తర్వాత స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మని చెప్తాడు.
సీన్ కట్ చేస్తే… వసు కారు దిగి ఇక్కడికి వచ్చాం ఏంటి సర్ అని అడుగుతుంది. మినిస్టర్ గారు మనల్ని భోజనానికి రమ్మన్నారు అంటాడు రిషి. పదండి శ్రీమతి గారు అంటూ ఒకరినొకరు పట్టుకుని ముందుకెళ్తారు. మినిస్టర్ ఎదురొచ్చి స్వాగతం చెప్తారు. ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తాడు. మీరు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందంటాడు. వసు కావాలనే ఎందుకు సర్ అని అడుగుతుంది. మీ జంట బాగుందని పొగడతాడు మినిస్టర్. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. అపుడే నాకో డౌట్ అంటాడు మినిస్టర్. మరి రిషిధారలు ఏం చెప్తారో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.