Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషిధారల ప్రేమ గెలుస్తుంది. ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయల్దేరతారు. నన్ను ఇన్నాళ్లు ఎందుకు బాధపెట్టావ్ వసుధార? అని నిలదీస్తాడు రిషి. ఆ తర్వాత ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం..
వసు, రిషిలు కస్సుబుస్సులాడుతూ కారులో వెళ్తారు. మధ్యలో వసు సార్ కారు ఆపండి అంటుంది. దిగి లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. మా ఎండీ గారికి చాలా కోపం. మా ఎండీ గారి మూడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలని ఉంది అని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. వసు మాటలు విని ఆనందంతో ఉప్పొంగిపోతాడు రిషి. నా ప్రేమ గెలిచింది. నేను ఓడిపోలేదు. వింటున్నావా ఆకాశం? అంటూ ఎగిరి గెంతేస్తాడు. వసు నాలో సగం. రిషి, వసు వేర్వేరు కాదని సంబరపడిపోతాడు.
Guppedantha manasu serial: సీన్ కట్ చేస్తే.. దేవయానిని చూసి ధరణి భయపడి వెనకాల నుంచి వెళ్తుంది. అయినా దేవయాని చూసి ధరణికి క్లాస్ పీకుతుంది. నన్ను చూస్తే నీకు, ఈ జనాలకు ఏమనిపిస్తుందని అడుగుతుంది. అలా ధరణితో దేవయాని పోట్లాడుతుంది. అపుడే రిషి వస్తాడు. హ్యాపీగా కనిపిస్తున్న రిషిని చూసి దేవయాని షాకవుతుంది. సంతోషంలో రిషి ధరణితో చాలా మాట్లాడతాడు. ధరణిని కూడా కాలేజికి రమ్మంటాడు. రిషి ప్రవర్తన అర్థం కాక దేవయాని ఆలోచనలో పడుతుంది. అసలేం జరిగింది. రిషిలో ఇంత ఉత్సాహం ఏంటని కంగారుపడుతుంది.
ఆ తర్వాత సీన్‌లో వసు, జగతి, మహింద్రలు కలిసి కాఫీ తాగుతారు. ఈ ఆనందాన్ని పార్టీలో ఎంజాయ్ చేయాలి అంటాడు మహింద్ర. రిషికి నిజం తెలియడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. అపుడూ రిషి ఎంట్రీ ఇస్తూ చప్పట్లు కొడతాడు. మహింద్ర మై డియర్ సన్ అంటూ హగ్ చేసుకుందామని ప్రయత్నిస్తాడు. కానీ రిషి దగ్గరికి రానివ్వడు. వసుధార తన మెడలో తనే తాళి వేసుకుందని మీ అందరికి తెలుసు. నా దగ్గర అందరూ చాలా బాగా నటించారు. మీరు గొప్పనటీనటులు. నేనొక్కడినే పిచ్చోడినా. అంతా కలిసి నన్ను పనికిమాలిని వాడిలా జతకట్టారా? ఏంటి డాడ్ మీరు మహా నటులని ఇపుడే తెలుసుకున్నా అంటూ మహింద్రని నిలదీస్తాడు రిషి. జగతిని కూడా ప్రశ్నిస్తాడు. మేడం మీరు కూడా నా ముందు నటించడం మొదలుపెట్టారా? అని అడుగుతాడు. నిజం తెలిస్తే నాకు చెప్పండి మేడం అంటూ ఎంత బతిలాడినా చెప్పలేదు కదా మేడం అంటూ బాధపడతాడు. అసలు జగతిని కూడా మాట్లాడనివ్వడు. ఆ ఒక్కటి తప్ప మిగతా అన్ని విషయాల్లో మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నా కదా మేడం అంటూ ప్రశ్నిస్తాడు. చక్రపాణిని కూడా నిలదీస్తాడు.
అపుడు వసుధార ‘నేనే చెప్పొద్దని చెప్పాను సర్. వీళ్ల తప్పు లేదు’ అని అంటుంది వసు. కానీ రిషి మాత్రం వసు మాట వినడు. అందరూ కలిసి నా ఎమోషన్స్‌తో ఆడుకున్నారని విలవిలలాడిపోతాడు. నేను బాధపడుతుంటే మీరు కిలకిల నవ్వుకున్నారు. ఇదేం రాక్షసానందం అంటాడు. అంతా అయిపోయింది కద రిషి. ఇపుడు నిజం తెలిసిపోయింది కదా రిషి అని మహింద్ర చెప్పబోయిన రిషి వినిపించడు. కానీ వసు విషయంలో గతంతో జరిగిందంతా తలుచుకొని రిషి ఎమోషనల్ అవుతాడు. మీరందరూ కలిసి నాతో ఆడుకున్నారని కోప్పడతాడు. నేను బాధపడుతుంటే మీరందరూ నవ్వుకున్నారని అంటాడు. వసు మాట్లాడుతుంటే వద్దని వారిస్తాడు. కానీ ఒక్క దానికి మీరందరూ సమాధానం చెప్తారా? అంటూ ప్రశ్నిస్తాడు. వసుధార తన మెడలో తాళి వేసుకోవడాన్ని మీరందరూ సమర్థిస్తున్నారా? అని అడుగుతాడు. తను అలా తాళి వేసుకుందంటే మీరు, నేను నమ్ముతాను కానీ సమాజం నమ్ముతుందా? అంటూ అందర్నీ ప్రశ్నిస్తాడు. మరి వాళ్ల సమాధానం ఏంటో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.