Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో మహింద్ర, జగతిలు కడుపు నొప్పంటూ నాటకమాడతాడు. దాంతో రిషి వసుధారలు కిట్లు పంచడానికి టూర్‌కు వెళ్తారు. అక్కడ ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం…
రిషిధారలు కారులో ఊరికి బయల్దేరతారు. దారిలో కారు పక్కన ఆపి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ ఇద్దరూ సరదాగా గొడవపడుతుంటారు. ఆ తర్వాత ఊరికి వెళ్లి ‘అందరికి నమస్కారం. మేము డీబీఎస్టీ కాలేజి ఆలోచన అమలు చేయడానికే వచ్చాము. నా పేరు వసుధార. ఈయన రిషి సార్’ అంటూ పరిచయం చేస్తుంది. అపుడే రిషి గురించి గొప్పగా చెబుతుంది. పిల్లలకు కావల్సిన పుస్తకాలను డీబీఎస్టీ కాలేజి అందిస్తుంది. మీ అందరి కోసం డీబీఎస్టీ కాలేజి ఈ కిట్స్ అందిస్తుంది. ఒక్కొక్కరూ వచ్చి ఈ కిట్స్ తీసుకోండి అని చెబుతుంది. అపుడే రిషి కూడా కాలేజి గురించి మాట్లాడతాడు. మీకు ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్తాడు. అపుడే కావాలని వసుధార గురించి చెప్తాడు. తను కూడా గొప్ప వ్యక్తి అంటూ పొగడతాడు. పిల్లలకు కిట్స్ అందిస్తూ గొప్పవాళ్లు కావాలని సూచిస్తారు. మధ్యమధ్యలో వసుని కోపంగా ఇన్‌డైరెక్ట్‌గా మాటలంటాడు. ఆ తర్వాత ధర్మయ్య రిషిధారలను భోజనానికి రమ్మని పిలుస్తాడు. సరేనని చెప్తాడు రిషి.
Guppedantha manasu serial: ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోతారు. వెంటనే వసు చాక్లెట్ తిందామా సర్ అంటూ అయ్యో ఒక్కటే ఉంది ఎలా అంటుంది. అపుడు రిషి చాక్లెట్ తీసుకుని తినేసి వెళ్దామా అంటాడు. ఆ తర్వాత ధర్మయ్య ఇంట్లో భోజనం చేస్తారు ఇద్దరూ. పచ్చిమిర్చి కొరకాలి సర్ మధ్యలో అంటూ రిషికిస్తుంది వసు. అపుడే ధర్మయ్య భార్య కొత్త దంపతులు చూడడానికి చిలకాగోరింకల్లా ఉన్నారని పొగడుతుంది. వసు రిషిని సార్ అని పిలుస్తుండగా ఏమయ్యా.. పెనిమిటి అని పిలవాలి ఇంకా సార్ ఏంటమ్మా అంటుంది. దాంతో వసు రిషిని అలాగే పిలుస్తుంది. రిషి అయోమయానికి గురవుతాడు. పచ్చిమిర్చి కొరకుతాడు రిషి. నోరంతా మంట పుడుతుంది రిషికి. మీరు మాకు సాయం చేసినందుకు మీకు వెళ్లేటపుడు బట్టలు పెడతాం కాదనకండి సార్ అంటాడు ధర్మయ్య. ఈ రోజు నాకు మంచి రోజు కాదు వద్దంటాడు రిషి. రిషిధారలు వెళ్తుంటూ మల్లీ వచ్చేసంవత్సరం పాపతోనో బాబుతోనో మా ఇంటికి రావాలని అంటాడు ధర్మయ్య. వసు సిగ్గుపడుతుంది లోలోపల.
కారులో తిరిగి వెళ్తుండగా వసు నిద్రపోతున్నట్లు నటిస్తుంది. నన్ను బాధపెట్టి ఇంత ప్రశాంతంగా నిద్రపోతావా అని మనసులో అనుకుని ర్యాష్‌గా డ్రైవ్ చేస్తాడు రిషి. ‘వసుధార పెళ్లి చేసుకుని వెళ్లావ్.. మళ్లీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావ్’ అని బాధపడతాడు రిషి. నాకంటే రిషి సార్‌కే పొగరు ఎక్కువ అని మనసులో తిట్టుకుంటుంది వసు. అంతలోనే మినిస్టర్ కాల్ చేసి రమ్మంటారు.
వసు మినిస్టర్ దగ్గర మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజె క్ట్ గురించి వివరిస్తుంది. అంతా విని బాగుందమ్మా అని మెచ్చుకుంటాడు మినిస్టర్. థాంక్యూ అంటారు ఇద్దరూ. ఆ తర్వాత మినిస్టర్ వసుని పిలిచి నీకు పెళ్లయిందని నాకు ఆలస్యంగా తెలిసింది. ఈ గిఫ్ట్ తీసుకో అంటాడు. రిషిని కూడా పిలుస్తారు మినిస్టర్. నా పెళ్లికి వచ్చిన అపురూపమైన కానుక అంటుంది వసు. ఇంతకీ మీవారేం చేస్తారని అడుగుతాడు మినిస్టర్. మావారు ఆల్ రౌండర్. చాలా గొప్పవారంటుంది వసు. అవునమ్మా రిషి సార్‌కి మీ ఆయన్ని పరిచయం చేశావా? అని మినిస్టర్ అడగ్గా నీళ్లు నములుతుంది వసు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.