Guppedantha manasu serial: నీ అనుమతి లేకుండానే నీ పేరు చెప్పాను. వసు ఆవేదనతో తనకు తోచిన పని చేసిందని రిషికి నచ్చచెప్తుంది జగతి. కానీ రిషి మాత్రం వసు చేసింది తనకు నచ్చలేదని చెప్తాడు. తను చేసింది తప్పయినపుడు నేను చేసింది కూడా తప్పే కద రిషి అంటుంది జగతి. నేనేం చేసిన మీ బంధాన్ని కాపాడడానికే రిషి అంటుంది. మేడం మీరు చేసింది పొరపాటని నేను అనలేదు కదా. లేకపోతే అందరిముందు అదే నిజమని నేను ఒప్పుకునేదాన్ని కాదు కదా అంటాడు రిషి. కానీ గతంలో చేసినవి మాత్రం కరెక్ట్ అని అనుకోవట్లేదు మేడం అంటాడు రిషి. రోజులు మారితే గాయం మానుతుందని అంటారు కానీ మనసుకు తాకిన గాయం మానదు మేడం అంటాడు. వసుని ఎప్పటికి క్షమించలేవా అని ప్రశ్నిస్తుంది జగతి. దానికి నా దగ్గర ఇపుడు సమాధానం లేదు మేడం అంటాడు. వసుకు నా పరిస్థితి రాకూడదు రిషి అని వేడుకుంటుంది జగతి.
సీన్ కట్ చేస్తే.. వసు తండ్రికి సపరియలు చేస్తుంటుంది. ఆ తర్వాత రిషికి మేసేజ్ చేయాలనుకుంటుంది. కానీ డిస్ట్రబ్ చేయడమెందుకుని ఆగిపోతుంది. డోర్ పెట్టలేదని చూసి పెడుతుండగా అపుడే రిషి వస్తాడు. బాగా తలనొప్పి వస్తుంది నీ చేతి కాఫీ తాగుదామని వచ్చా అంటాడు. వసు వెళ్లి కాఫీ పెట్టి తీసుకొస్తుంది. కాఫీ తాగుతుండగా వసు మాట్లాడుతుంది. సర్ నాకు పొగరు, ఇగో మీ ముందు ఉండవు సర్. మీ ముందు వసుధార నిలువెళ్లి కరిగిపోతుంది అని చెప్పుకుంటుంది. అపుడున్న తన పరిస్థితిని అర్థం చేసుకోమని వేడుకుంటుంది. రిషి మనసులో ఆ ఒక్క పని చేయకుండా ఉంటే బాగుండు వసుధార అనుకుంటాడు. కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి రిషి వెళ్తుండగా వసుధార అడ్డుకుంటుంది. నాతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నారున సర్ అని అడగ్గా.. జగతి మాటల్ని గుర్తుచేసుకుని వసుని హగ్ చేసుకుంటాడు రిషి. ఇదే మన బంధం.. ఇదే మన దూరం అని చెప్పి వెళ్లిపోతాడు.
Guppedantha manasu serial: ఆ తర్వాత సీన్‌లో రిషి కాలేజికి వస్తుండగా కొందరు స్టూడెంట్స్ దారికి అడ్డంగా నిల్చుంటారు. అపుడే వేరొక కారులో జగతి, మహింద్రలు కూడా వస్తారు. రిషి దిగి ఏంటని అడగ్గా.. హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్ సర్ అంటారు. అక్కడ జగతి, మహింద్రలు ఈ ఫ్లకార్డ్స్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటని అనుకుంటారు. అక్కడ స్టూడెంట్స్ మేడం రాలేదా సర్ అని అడుగుతారు. రిషి మాత్రం ఏం చెప్పకుండా వెళ్లిపోతాడు. మహింద్ర వాళ్లకు థ్యాంక్స్ చెప్పి పంపించేస్తాడు.
సీన్ కట్ చేస్తే.. వసు రిషితో పంచుకున్న గుర్తుల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. పక్కన ఫోన్ మోగుతున్న పట్టించుకోవడంతో చక్రపాణి వచ్చి ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతాడు. వసు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. మినిస్టర్ గారి పీఏ మిమ్మల్ని మినిస్టర్ రమ్మన్నారని చెప్తాడు. రిషి సర్ ని కనుక్కొని చెప్తానంటుంది వసు. రిషికి విషయం ఎలా చెప్పాలో అర్థం కాదు వసుకు.
ఆ తర్వాత రిషి వసు ఇంకా కాలేజికి రాలేదేంటని ఆలోచిస్తాడు. అపుడే వసు కూడా మెసేజ్ పెట్టాలని అనుకుంటుంది. అలా ఇద్దరూ వేర్వేరుగా దాని గురించే ఆలోచిస్తారు. వసు మెసేజ్ పెట్టి కావాలనే డిలిట్ చేస్తుంది. రిషి మెసేజ్ చూడకముందే డిలీజ్ చేయడంతో ఏంటి ఈ పొగరు అసలు ఏమనుకుంటుంది అనుకుంటాడు రిషి. అంతలోనే రిషికి మినిస్టర్ గారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.