Guppedantha manasu serial: పెళ్లి విషయం దాచినందుకు వసుధారతో సహా అందరి మీద కోపంతో ఉంటాడు రిషి. తనని కూల్ చేసేందుకు వసు ఫోన్ చేస్తుంది. కానీ రిషి కావాలని ఫోన్ కట్ చేస్తాడు. వసు కూడా ఏమాత్రం తగ్గకుండా మళ్లీ కాల్ చేస్తుంది. అపుడు రిషి ఫోన్ లిఫ్ట్ చేసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. నిద్రొస్తుంది అని చెప్తాడు. రిషి మీద కవిత్వాలు చెప్తూ కోపం తగ్గించే ప్రయత్నం చేస్తుంది వసు. కానీ కోపంతో ఫోన్ కట్ చేస్తాడు రిషి. మళ్లీ మళ్లీ కాల్ చేస్తూ విసుగిస్తుంది వసు. ఆ తర్వాత గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది.
మరుసటి రోజు ఉదయం జగతి, మహింద్రలు కాలేజికి వెళ్లి.. రిషి, వసుధారలు కలిసి కూర్చున్న ప్రదేశాన్ని చూస్తూ బాధపడతారు. రిషి ఇంకా కాలేజికి రాలేదని కంగారు పడుతుంది జగతి. అంతలోనే రిషి కారు బయల్దేరుతుంది. దారిలో కారుకు అడ్డంగా నిల్చుంటుంది వసు. రిషి సార్ వచ్చి లిఫ్ట్ ఇస్తా రా అని పిలిచేవరకు నేను వెళ్లనని మనసులో అనుకుంటుంది వసు. పొగరు అంటే ఇగో అని తిట్టుకుంటారు ఇద్దరూ. నాకు ఇగో ఉంది ముందు నేను మాట్లాడను అనుకుంటారు. కావాలని ఫోన్ చేసి మీటింగ్ ఉందని చెప్తాడు రిషి. వసు స్పీచ్ ఇస్తుందని చెప్పడంతో.. సడెన్‌గా మీటింగ్ ఏంటి సర్ అని అంటుంది వసు. ఆ తర్వాత కారు కాలేజిలో ఆగుతుంది. సీటు బెల్టు రావడం లేదు హెల్ప్ చేయొచ్చు కదా సర్ అని అడుగుతుంది వసు. ట్రై చెయ్ అంటాడు కానీ రిషి తీయడు. ఏంటి సర్ సాధిస్తున్నారా? అని అంటుంది వసు. చివరకు తనే దిగుతుంది వసు.
Guppedantha manasu serial: మీటింగ్‌కు టైం అవుతుంది రెడీ అవమని చెప్తాడు రిషి. ఏం మాట్లాడాలి సర్ మీటింగ్‌లో అని అడుగుతుంది వసు. ప్రాజెక్ట్ హెడ్‌వి నవు్.. నేను కాదు… ఏం మాట్లాడాలో నువ్వే ఆలోచించుకోమని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషి క్యాబిన్‌లో ఉన్న హార్ట్ సింబల్‌ని చూసి ‘ఇలా చేశావేంటి వసుధార’ అనుకుంటూ బాధపడతాడు. ఆ తర్వాత రిషి పెన్ తీసి ఎండీ అని రాస్తుండగా వసుధార వచ్చి చూస్తుంది. వసుని చూసి పక్కకు దాచుకుంటాడు రిషి. హార్ట్ మీద ఎండీ అని రాసుకున్నారేంటి సర్ అని అడగ్గా.. మరి నేను ఎండీనే కదా అంటాడు రిషి. అలా ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. అంతలోనే అక్కడికి జగతి, మహింద్రలు వస్తారు.
‘చూశారా సర్.. రిషి సార్ హార్ట్ మీద రాసుకున్నారు’ అని చెప్తుంది వసు మహింద్రతో. నా పెన్ నా ఇష్టం అంటాడు రిషి చిలిపిగా. వసు మాత్రం రిషిని ఎండీ అంటూ ఇరికిస్తుంది. నేమ్ బోర్డ్ రాసుకోవచ్చు కద రిషి అంటూ సలహా ఇస్తాడు రిషి. మీటింగ్‌కి టైం కాలేదా అని అడగ్గా.. ఇంకా మూడు నిమిషాలు ఉందంటుంది వసు. వాళ్ల గొడవని చూసి జగతి, మహింద్రలు రాంగ్ టైంలో వచ్చామంటూ వెళ్లిపోతారు. ఆ తర్వాత వసు వెళ్లిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. దేవయాని రిషి తన చేజారి పోతాడని ఆందోళన చెందుతుంది. ఆ తర్వాత కాలేజిలో మీటింగ్‌కి అందరూ హాజరవుతారు. వసుతో వస్తున్న ఫణింద్ర సర్‌ని ఇక్కడ కూర్చోమని పిలుస్తాడు రిషి. ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి రిషి మాట్లాడతాడు. అపుడే వసుని కావాలని ఇరికిస్తాడు. ఈ ప్రాజెక్ట్‌ని పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్తుందని వసు గురించి చెప్తాడు. ఇపుడు ప్రాజెక్ట్ హెడ్ వసుధార మాట్లాడుతుందని చెప్తాడు రిషి. దాంతో వసులో కంగారు పెరుగుతుంది. వసు మరి మీటింగ్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.