Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: తన పెళ్లి గురించి రిషికి చెప్పేస్తానంటున్న వసు.. లైబ్రరీలో ఏం జరుగుతుందో మరి?

Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషికి వసుధార పెళ్లి మీద అనుమానం కలుగుతుంది. అపుడే మహింద్ర కూడా వసు పెళ్లి గురించి రిషికి నిజం చెప్పాలనుకుంటాడు. ఆ తర్వాత ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
రిషి బెడ్రూంలోకి రావడం చూసి జగతి మాట మార్చుతుంది. కానీ మహింద్రకు ఏం అర్థం కాదు. అలా అలా నటించి మేనేజ్ చేస్తాడు. మహింద్ర రానంటే రానని శపథం చేయడంతో రిషి నేను తీసుకెళ్తా మేడం అంటూ జగతిని వెంట తీసుకెళ్తాడు. మహింద్ర ఎక్కడికి జగతి అని అడిగినా తర్వాత చెప్తాను అంటూ వెళ్లిపోతుంది జగతి. కారులో కొడుకుతో వెళ్తున్నందుకు హ్యాపీగా ఫీలవుతుంది జగతి. అదే టైంలో రిషి వసు పెళ్లి గురించి జగతిని అడగాలనుకుంటాడు.

వసు గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. జగతి కూడా తెలిసినా నిజం చెప్పదు. రిషి ఇప్పుడు మనం వెళ్తున్నది వసు వాళ్లింటికి అని చెప్తుంది జగతి. ఎందుకో అడగనా వద్దా? అని రిషి అనుకుంటాడు మనసులో. జగతి కూడా ఎందుకో అడగచ్చు కదా అనుకుంటుంది. అంతలోనే వసు వాళ్ల ఇళ్లు వస్తుంది. రిషి ఇంట్లోకి రాకుండ కారులోనే ఉంటానంటాడు. సరేనంటూ వెళ్తుంది జగతి.

Guppedantha manasu serial: jagathi is upset

Guppedantha manasu serial: సీన్ కట్ చేస్తే.. ‘మేడం మీరేంటి ఇలా వచ్చారు’ అని అడుగుతుంది వసు జగతిని. పరిస్థితులు ఎవరినైనా రప్పిస్తాయి వసు అంటుంది జగతి. రిషి సార్ కారు సౌండ్ వచ్చింది మహింద్ర సార్ వచ్చారా? అంటుంది వసు. లేదు రిషికి తలనొప్పంటూ బయటే ఉన్నాడు అని చెప్తుంది జగతి. నీతో మాట్లాడాలి వసు అని జగతి అంటుంటే ఇపుడే వస్తాను మేడం అంటూ వసు కారు దగ్గరికి వెళ్తుంది. వసు రావడం చూసి పాటల సౌండ్ పెంచుకుని గ్లాస్ వేసుకుంటాడు రిషి. వసు డోర్ కొడుతుంటే చివరకు తీస్తాడు రిషి. ఇంట్లోకి రమ్మంటే నేను రాను. నాకు తలనొప్పి అంటాడు రిషి. అలా ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. రిషి రానంటే రానని భీష్మించుకుని కూర్చుంటాడు. నేను వెళ్లాక మనసు మారితే 5నిమిషాలు ఆగి రమ్మంటుంది వసు. దాంతో రిషిలో అనుమానం కలుగుతుంది. వసు భర్త ఇంట్లో ఉన్నాడేమో చూడొచ్చు అని వెంటనే వెళ్తాడు రిషి.

రిషి ఇంట్లోకి వెళ్లి అంతా వెతుకుతాడు కానీ ఎవరూ కనిపించరు. అది గమనించి వసు.. మీకు కావాల్సిన వాళ్లు లోపల ఉన్నారంటుంది. దాంతో బెడ్రూంలోకి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించరు. అద్దంలో తనని తానే చూసుకుంటాడు రిషి. వసు ఉద్దేశం ఏంటి నన్ను నాకే చూపిస్తుందా అని కోపంగా వెళ్లిపోతాడు. దాంతో జగతి వసుని కోప్పడుతుంది. డైరెక్ట్‌గా రిషితో చెప్పలేవా? అని ప్రశ్నిస్తుంది. నాకు ధైర్యం చాలడం లేదు మేడం అని బాధపడుతుంది వసు. రిషి సార్‌కి నిజం తెలిసేలా చేస్తా మేడం అని మాటిస్తుంది వసు. క్యాబ్ బుక్కవడంతో జగతి కూడా వెళ్లిపోతుంది.

సీన్ కట్ చేస్తే.. వసు మాటల్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతాడు రిషి. నన్నెందుకిలా పిచ్చి వాడిని చేస్తుందని మనసులో ఆవేదన చెందుతాడు. అక్కడ జగతి కూడా రిషి కోపాన్ని తలుచుకుంటుంది. అంతలోనే మహింద్ర వస్తాడు అక్కడికి. అక్కడ జరిగిన గొడవ గురించి చెప్తుంది జగతి. అది కరెక్ట్ కాదు జగతి.. వసుధారని నిజం చెప్పమందాం అంటూ వసు కోసం క్యాబిన్‌కి వెళ్తారు. కానీ అక్కడ వసు ఉండదు. మేడం లైబ్రరీకి వెళ్లిందని చెప్తాడు వాచ్‌మెన్.

ఆ తర్వాత సీన్‌లో రిషి లైబ్రరీకి వెళ్లి ఎవర్నీ లోపలికి రానివ్వకని వాచ్‌మెన్‌కు చెప్తాడు. కానీ అప్పటికే వసు లోపల ఉంటుంది. మరి లైబ్రరీలో రిషి, వసుల మధ్య ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

Savitha S

Recent Posts

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…

4 days ago

This website uses cookies.