Guppedantha manasu serial: వసుధారా.. నేను లేకుండా ప్రెస్‌మీట్ అరెంజ్ చేయమని సూచిస్తాడు రిషి. నేను ఒక్కదాన్ని చేయడం కుదరదు సర్ అంటుంది వసు. అపుడే జగతి కూడా మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటూ బాగుంటుందని అంటుంది. అంతలోనే దేవయాని వచ్చి అరుస్తుంది. తనకి ఆరోగ్యం బాగలేదని.. ఇప్పుడు ఎందుకివ్వన్నీ అంటుంది కోపంగా. మహింద్రని కూడా అనేస్తుంది దేవయాని. ప్రెస్‌మీట్‌కి సంబంధించి మేము ఇప్పుడు మాట్లాడుకోవాలి పెద్దమ్మ అని తేల్చి చెప్తాడు రిషి. మనం వెళ్దాం పద మహింద్ర అంటుంది జగతి. దేవయానిని కూడా పంపించేస్తాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి కొన్ని పాయింట్స్ వసుకు చెప్పి వాటినే ప్రెస్‌మీట్‌లో మాట్లాడమంటాడు రిషి. వసు వెళ్లబోతుంటే వెళ్తావా? అని అంటాడు రిషి. అపుడే తన మెడలో ఉన్న తాళి గురించి మాట్లాడుకుంటారు ఇద్దరూ. వస్తాను సర్ అని వసు అంటే థ్యాంక్స్ అంటాడు రిషి. నేను ఇంటికి వెళ్లి కాలేజికి వెళ్తాను సర్ అంటుంది వసు.యవసు వెళ్లాక నీ తొందరపాటు మన బంధానికి అడ్డుగోడలా నిలిచింది అని తలుచుకుంటూ బాధపడతాడు రిషి.
మరుసటి రోజు ఉదయం రిషి సర్ కారుని కాలేజిలో చూసి వసు ఆశ్చర్యపోతుంది. లోపలికి వెళ్లి ‘ఏంటి సర్ మీరు’ కాలేజికి ఎందుకు వచ్చారు. ఇంటికి వెళ్లండి అని అంటుంది వసు. ప్రెస్‌మీట్ ఉంది కదా వసు అంటే నేను చూసుకుంటాను సర్ అంటుంది వసు. ముందు మీరు వెళ్లండి అంటూ రిషిని దబాయిస్తుంది. నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ బయటికి వెళ్తుంది వసు. అటెండర్‌కి చెప్పి ట్యాబ్లెట్స్ తెప్పిస్తుంది వసు. అపుడే రిషి ఓ స్టూడెంట్‌కి సంబంధించిన కాల్ మాట్లాడతాడు. వసు ట్యాబ్లెట్స్‌తో అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. వీళ్లిద్దర్ని బయటి నుంచి వేరే ఇద్దరూ మేడం వాళ్లు గమనించి వెళ్తారు. ట్యాబ్లెట్ వేసుకుని బయటికి వెళ్తాడు రిషి.
Guppedantha manasu serial: వసు, రిషిల గురించి మేడం వాళ్లు బయట మాట్లాడుకుంటారు. వసుధారకు పెళ్లయిందని తెలిసి రిషి సార్ వదిలేయచ్చు కదా ఇంకా కాలేజికి తీసుకురావడం ఎందుకు అంటూ వాళ్ల గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అది చూసి రిషి వాళ్లని మేడం మీరు నా క్యాబిన్‌కి రండి అని చెప్తాడు. అటెండర్‌తో జగతి మేడంని కూడా పిలవమంటాడు. మహింద్ర, జగతిలు మాట్లాడుకుంటుండగా అటెండర్ వచ్చి జగతిని పిలుస్తాడు. క్యాబిన్‌కి వెళ్తుండగా వసు కలుస్తుంది. జగతి వసుకు థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత క్యాబిన్‌కి వెళ్తుంది జగతి. జగతిని కూర్చోమని మేడం ఇవన్నీ వీళ్లు చేసిన తప్పుల రిపోర్ట్ అంటూ జగతి చేతికందిస్తాడు. వీళ్ల మాటల్ని నేను స్వయంగా విన్నాను. అవసరం లేని విషయాల గురించి డిస్కస్ చేస్తున్నారు. పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నారు. వసుతో కలిపి నన్ను కూడా ఇష్టమొచ్చిన మాటలన్నారు అని జగతితో చెప్తాడు రిషి.
ఇంతకుముందు కూడా వసు గురించి మీకు చెప్పాను. మీరు మారరని నాకు అర్థమైంది. మేడం మీకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే వేరే దగ్గరికి వెళ్లండి అంటూ సలహాఇస్తాడు రిషి. మేడం వీళ్లిద్దర్ని డిస్మిస్ చేశాను. సర్క్యూలర్‌లో పెట్టండి అంటూ జగతి మేడంకి సూచిస్తాడు. మీరు ఏం మాట్లాడాలన్నా జగతి మేడంతో మాట్లాడండి అంటూ వెళ్లిపోతాడు రిషి. అంతటితో ఎపిసోడో ముగుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.