Guppedantha manasu serial: రిషి మాట మీద గౌరవంతో జగతి కూడా ఆ మేడం వాళ్లని డిస్మిస్ చేస్తుంది. వాళ్లు మరో దారి లేక దేవయాని దగ్గరికి వెళ్లాలనుకుంటారు. ఆ తర్వాత ధరణి దేవయానికి ఫ్రూట్స్ తినండి అత్తయ్య గారూ అని ఇస్తుంది. అపుడే కాలేజి నుంచి ఇద్దరు స్టాఫ్ వచ్చి దేవయాని కాళ్లు పట్టుకుంటారు. మీరే మమ్మల్ని కాపాడాలి మేడం అంటూ వేడుకుంటారు. ఏం జరిగిందని దేవయాని అడగ్గా.. జరిగిందంతా చెప్తారు వాళ్లు. ఒక పని చేయండి.. ప్రెస్‌మీట్‌లో చెప్పండి. వసుధార వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పండి. రిషి గురించి గొప్పగా చెప్పండని సూచిస్తుంది. మిగతాదంతా నేను చూసుకుంటానని హామీ ఇస్తుంది. సరే మేడం అంటూ వెళ్తారు వాళ్లు. చాటుగా ధరణి ఈ మాటలన్ని వింటుంది.
సీన్ కట్ చేస్తే.. రిషి సార్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారో లేదో అనుకుంటూ క్యాబిన్‌లోకి వెళుతుంది వసు. మిమ్మల్ని ఇంటికి వెళ్లమన్న కదా అంటుంది రిషిని దబాయిస్తుంది. ఇంటికెళ్లి లైట్‌గా భోజనం చేయండని చెప్తుంది. అటెండర్‌ని పిలిచి రిషి ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లమని చెప్తుంది. మీరు ఇంటికెళ్లక పోతే నేను ప్రెస్ మీట్‌కి కూడా వెళ్లనని బెదిరిస్తుంది వసు. ఆర్డర్ హా అధికారమా అని రిషి అడగ్గా.. బాధ్యత సర్ అంటూ జవాబిస్తుంది వసు. థ్యాంక్స్ అంటూ చేయిస్తాడు రిషి. అంతలోనే వసు మెడలో ఉన్న తాళి చూసి ఆగిపోతాడు. దాంతో బాధగా వెళ్లిపోతుంది వసు.
Guppedantha manasu serial: వసుధార నువ్ చేసిన పని నాకు నచ్చలేదు. ఈ పని నన్నెపుడు ముళ్లులా గుచ్చుతునే ఉంటుందని మనసులో అనుకుంటాడు రిషి. ఆ తర్వాత జగతి, మహింద్రలు ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తారు. అపుడే రిషి కనిపిస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ రిషి అని అడగ్గా.. ఇంటికెళ్తున్నానని చెప్తాడు రిషి. లంచ్ టైంలో వెళ్లడమేంటి అని మహింద్ర అడగ్గా.. ఆర్డర్ వచ్చింది కాబట్టి వెళ్తున్నాని అంటాడు రిషి. అలా ఇద్దరూ మాట్లాడుకున్నాకు రిషి వెళ్లిపోతాడు. నాకేం అర్థం కాలేదు జగతి అంటాడు మహింద్ర జగతితో. ఆర్డర్ వేసింది ఎవరంటావ్ అని అడగ్గా.. ఇంకెవరు మహింద్ర.. వసుధార చెప్పి ఉంటుంది అని అంటుంది జగతి.
డిస్మిస్ చేసిన కాలేజి స్టాఫ్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడాలో గుర్తుచేసుకుంటారు. రిపోర్టర్‌కి ఫోన్ చేసి మా తరఫున మాట్లాడాలి అని వేడుకుంటారు. సరేనంటాడు తను. అపుడే దేవయాని కూడా కారులో కాలేజికి బయల్దేరుతుంది. అక్కడ రిషి వసు మాటల్ని గుర్తుచేసుకుంటూ ఇంటికెళ్తాడు. కాలేజిలో వసు, జగతి, మహింద్రలు ప్రెస్ మీట్‌కి రెడీ అవుతారు. ఫణింద్ర వచ్చి రిషి కనిపించట్లేదని అడగ్గా.. నేనే ఇంటికి వెళ్లమన్నానని చెప్తుంది వసు. నువ్ కాల్ చేసి రిషిని పిలవమని జగతికి చెప్తాడు ఫణింద్ర. రిషికి కాల్ చేస్తూ బయటికి వస్తారు జగతి, వసులు. అపుడే డిస్మిస్ చేసిన స్టాఫ్ మాటల్ని వింటారు. అంతలోనే రిపోర్టర్స్ కూడా అక్కడికి వస్తారు. మీరే మమ్మల్ని కాపాడాలని వేడుకుంటారు. మీ గురించి మాకు రిపోర్ట్ వచ్చింది. రిషి సార్ పంపించారు. తప్పంతా మీవైపే పెట్టుకుని రిషి, వసులను అంటారా అని వాళ్లకు క్లాస్ పీకుతారు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.