Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో వసుని టార్గెట్ చేస్తాడు రిషి. సడెన్‌గా మీటింగ్ అరెంజ్ చేసి వసుని మాట్లాడమంటాడు. మరి వసు ఎలా మెనేజ్ చేసిందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం..
వసు నిల్చుని మాట్లాడడం ప్రారంభిస్తుండగా కూర్చోని మాట్లాడొచ్చని అంటాడు రిషి. సడెన్‌గా మీటింగ్ అనే సరికి టెన్షన్‌గా ఉందంటుంది వసు. ఆ తర్వాత రిషి టాపిక్ మెసేజ్ చేస్తుండగా వసు మాట్లాడుతుంది. అందరూ చప్పట్లు కొట్టి వసుని ఎంకరేజ్ చేస్తారు. వసుని బాగా చెప్పావని అందరూ అభినందిస్తారు. రిషిని ఎంహెచ్ అంటే ఏంటని అడగ్గా.. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని చెప్తాడు. ఆ తర్వాత మనసులో మై హార్ట్ కద పొగరు అని అనుకుంటాడు మనసులో. వసు వెళ్తుండగా జగతి వచ్చి మళ్లీ పొగడుతుంది. ఎంహెచ్ అంటే ఏంటి వసు అని అడుగుతుండగానే రిషి వచ్చి అక్కడ నిల్చుంటాడు.
సీన్ కట్ చేస్తే.. రిషి తన క్యాబిన్‌లో కారు ‘కీ’ కోసం వెతుకుతాడు. అక్కడ వసు కారులో కూర్చోని కీ దగ్గర పెట్టుకుంటుంది. మా ఇంటి దగ్గర దింపమని వసు అడగ్గా.. నేను రానని ఇద్దరూ పోట్లాడుకుంటారు. రిషి సెక్యూరిటీని పిలిచి వెహికిల్‌కి సెక్యూరిటి పెంచమని చెప్తాడు. వసు వెళ్దాం రండి సర్ బలవంతం చేయగా చివరకు కార్ స్టార్ట్ చేస్తాడు రిషి.
ఆ తర్వాత సీన్‌లో దేవయాని చక్రపాణి ఇంటికెళ్లి క్లాస్ పీకుతుంది. చక్రపాణి కూడా అదేస్థాయిలో రిప్లై ఇస్తాడు. నా పేరే కాదు నా తీరు కూడా తెలుసుకోండి అంటూ వార్నింగ్ ఇస్తాడు. రిషికి నీ కూతుర్ని దూరంగా పెట్టమని హెచ్చరిస్తుంది. మొఖానా డబ్బులు కొడతా తీసుకొని వెళ్లమని అంటుంది దేవయాని. నోరు మూయండి అంటూ అరుస్తాడు చక్రపాణి. ఇంటికొచ్చావని ఆగుతున్నా.. లేకపోతేనా? అంటూ దేవయాని మీద మండిపడతాడు. ఇంకోసారి ఇంటివైపు వస్తే చక్రపాణి విశ్వరూపం చూస్తావంటూ బెదిరిస్తాడు. దాంతో దేవయానిలో కంగారు పెరుగుతుంది. అంతలోనే రిషి వచ్చి పెద్దమ్మా అంటూ పిలుస్తాడు. పెద్దమ్మ ఏదో గొడవ చేసిందని ఊహించుకుని దేవయానిని తీసుకుని వెళ్తాడు. వసు చక్రపాణిని అడిగినా ఏం చెప్పడు. రిషి ఏమంటాడో అని దేవయాని భయపడుతుంటుంది మనసులో. అపుడే రిషికి వసుధార మెసేజ్ చేస్తుంది. అలానే కారు ఆపి వసుతో చాటింగ్ చేస్తాడు రిషి. రిషి కోపంగా రిప్లై ఇస్తుండడంతో వసు ఇక చాటింగ్ ఆపేయాలని అనుకుంటుంది. రిషి ఎవరు ఫోన్‌లో అని దేవయాని అడగ్గా.. వసుధార పెద్దమ్మ అని అంటాడు.
కాలేజి పరంగా మా ఇద్దరి మధ్య చాలానే ఉంటాయి కానీ మీరు ఇక్కడి వరకు రాకుండా ఉండాల్సింది అంటాడు రిషి. నాకోసం మీరు ఇబ్బంది పడొద్దు పెద్దమ్మ అంటాడు రిషి. అక్కడ జగతి ధరణిని పిలిచి వంటలో సహాయం చేయాలా? అని అడుగుతుంది. ఆ తర్వాత అక్కయ్య ఎక్కడికి వెళ్లిందని అడగ్గా ఏమో చిన్నత్తయ్య అని ధరణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.