Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: దంపతులకు గిఫ్ట్ ఇచ్చిన మినిస్టర్.. భార్యని బాగా చూసుకోమని రిషికి సలహా ఇచ్చిన పెద్దావిడ!

Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషిధారలు మినిస్టర్ ఇంటికి భోజనానికి వెళ్తారు. అక్కడ మినిస్టర్ మీ ప్రేమ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది అని రిషిని అడుగుతాడు. దాంతో రిషికి పొలమారుతుంది. మీ జంట చూడముచ్చటగా ఉందంటూ కొత్త దంపతుల్ని పొగడతాడు మినిస్టర్. ఆ తర్వాత రిషిధారలు మినిస్టర్ దగ్గర ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు. వసుని షాపింగ్‌కి తీసుకెళ్లమని రిషికి చెప్తాడు మినిస్టర్. ఆ తర్వాత స్టడీస్‌లో నువ్ ఎలా టాపర్‌ ఓ జీవితంలో కూడా అలాగే ఉండాలని అంటాడు రిషి. మంచి భార్యని కావడం కష్టమేమో సర్ అంటుది వసు. నీకేం తక్కువ అంటూ వసుని పొగడతాడు మినిస్టర్. ఆ తర్వాత రిషిధారలకు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాడు మినిస్టర్.

సీన్ కట్ చేస్తే.. రిషిధారలు తిరిగి వెళ్తుండగా వసు చేసిన పని తప్పని మళ్లీ అంటాడు రిషి. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్లని కూడా మోసం చేస్తున్నాం అంటాడు రిషి. మనం నటించడం మొదలు పెడదామా అన్న రిషి మాటల్ని గుర్తు చేసుకుని నేను నటించలేదు సర్.. మీ భార్యగానే మీ వెంట వచ్చాను అనుకుంటుంది వసు మనసులో. దారిలో కారు ఆపి ఓ చోట కూర్చుని మాట్లాడుకుంటారు రిషిధారలు. ఈ రోజు ప్రయాణంలో నీకేమైనా తేడా అనిపించిందా అని అడుగుతాడు రిషి. అవును సర్ ఇన్నాళ్లు మీ అసిస్టెంట్‌గా వచ్చేదాన్ని.. ఇప్పుడు మీ భార్యగా వచ్చాను కదా అని సంతోషపడుతుంది వసు. నువ్ నన్ను భర్తగా అనుకుంటే నేను నిన్ను భార్యగా అనుకోవాలి కదా అంటాడు రిషి మళ్లీ. ప్రపంచానికి మనం భార్యభర్తలం. కానీ నిజం మనకే తెలుసు. పాపం ఆయనకి నిజం తెలియదు. నాకు తాళి కట్టే అవకాశమే లేకుండా చేశావు కదా వసుధార. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుందా అంటూ బాధపడతాడు రిషి.

Guppedantha manasu serial: an advise for rishi

కాలేజి తర్వాత నా జీవన ప్రయాణం మొదలైంది సర్ అంటుంది వసు. ప్రేమంటే అన్నింటిని ఓర్చుకోవడమే కద సర్ అని హితబోధ చేస్తుంది. అపుడు రిషి కూడా నీ విషయంలో నేను చాలా ఓర్చుకున్నాను కదా అంటాడు. మరి ఈ ఒక్క విషయంలో ఎందుకు బాధపెడుతున్నారని ప్రశ్నిస్తుంది వసు. నన్ను నేను రక్షించుకోవడానికి నా మెడలో తాళి వేసుకున్నానని అంటుంది. అప్పటి పరిస్థితుల్ని మళ్లీ గుర్తుచేస్తుంది వసు. ఒక భర్తగా తాళి కట్టలేకపోయానని వాపోతాడు రిషి. నన్ను బాధించి మళ్లీ నువ్వే బాధపడితే ఎలా అంటాడు రిషి. నాకు నీ మీద ప్రేమ, గౌరవం తగ్గలేదు.. తగ్గదు కూడా అంటాడు రిషి. నువ్ నా భార్యగా రావాలంటే ఈ గుండెకు అయిన గాయం ఎప్పుడు మానుతుందో కద అంటాడు రిషి.

సీన్ కట్ చేస్తే.. పూలు అమ్మే ఆవిడని పిలిచి పూలు కొంటాడు రిషి. ఆమె వసుని చూసి మీకు పెళ్లయిందామ్మా అని అడుగుతుంది. ఆయన మావారేనని చెప్తుంది వసు. మీరు అమ్మవారి దగ్గర కనిపించినపుడే అనుకున్నా.. సంతోషం అంటుంది ఆవిడ. మేడంని మంచిగా చూసుకోండి సారూ అని సూచిస్తుంది. నన్ను మంచిగా చూసుకోమని చెప్పరా అని రిషి అడగ్గా.. ఏ ఆడది అయిన భర్తని దేవుడిలాగే చూసుకుంటది సారూ.. అదే ఆడదాని గొప్పతనమంటుంది. ఆ తర్వాత రిషి డబ్బులు ఇచ్చి ఆమెని పంపించేస్తాడు. ఆ తర్వాత వసుకి పూలు ఇస్తాడు. హ్యాపీగా వసు పూలు తలలో పెట్టుకుంటుంది. నేను మీ భార్యని కానపుడు పూలెందుకు కొనిచ్చారని అడుగుతుంది వసు. ఇంతకు ముందు కూడా కొనిచ్చా కదా అంటుండగానే వసు తలలో ఉన్న పూలు కిందపడబోతుంటే పట్టుకుంటాడు రిషి. జాగ్రత్త వసుధరా అని చెప్పి వెళ్లి కారులో కూర్చుంటాడు.

ఆ తర్వాత సీన్‌లో కారు వసు ఇంటిముందు ఆగుతుంది. పిలిస్తే వస్తారా? అని వసు మనసులో అనుకుంటుంది. రిషి కూడా అలాగే ఆలోచిస్తాడు. కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్తుందేంటో అనుకుంటాడు. వసుధార అని పిలిచి.. నీకొకటి ఇవ్వడం మర్చిపోయా అని కారులో ఉన్న మినిస్టర్ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు. రిషి మాటలకు హర్ట్ అవుతుంది వసు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Savitha S

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.