Guppedantha Manasu:బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…రిషి వసుధార ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుతూ బయలుదేరుతూ ఉంటారు. అదే సమయంలోనే ఓ అమ్మాయి వారు కారు వెంట పరుగులు తీస్తూ నన్ను కాపాడండి ప్లీజ్ అంటూ కేకలు వేస్తుంది. అది గమనించిన రిషి కారు ఆపుతాడు. ఏమైంది ఎందుకు అలా పరుగులు పెడుతున్నావు అని అడగడంతో ఎవరో ఇద్దరు రౌడీలు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు సార్ నన్ను కాపాడండి అంటూ వేడుకుంటుంది.
అమ్మాయి అలా చెప్పేసరికి రిషి తనకు కాస్త నీళ్లు ఇచ్చి నువ్వేం కంగారు పడకు నేను పోలీసులకు ఫోన్ చేస్తా అంత వాళ్ళు చూసుకుంటారు అని రిషి చెప్పగా ఆ అమ్మాయి పోలీసులంటే మా అమ్మ నాన్నలు భయపడతారు వారికి ఇష్టం లేకపోయినా నేను జాబ్ చేస్తున్నాను అని అబద్ధాలు చెబుతుంది. ఇక ఆ మాటలు విన్న రిషి వసుధార షాక్ అవుతారు. నన్ను వారి నుంచి కాపాడి మా ఇంటి వరకు డ్రాప్ చేయండి చాలు అని అడగడంతో రిషి వసుధర సరే వెళ్దాం పద అని తనని కారులో ఎక్కించుకొని వెళ్తారు.
మరోవైపు జగదీష్ మహేంద్ర వసుధార రిషి ఇంకా ఇంటికి రాలేదు చాలా ఆలస్యం అవుతుందని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే వసుధార ఫోన్ చేసి మేడం మేము దారిలో ఉన్నాము కాస్త చిన్న పని పడింది మీరు భోజనం చేసి పడుకోండి అని చెబుతుంది. అంతలోపే దేవయాని అక్కడికి వచ్చి ఎవరు జగతి ఫోన్ అని అడగడంతో వసుధార వారికి ఏదో పని పడినట్టు కాస్త ఆలస్యం అవుతుందని చెప్పడంతో అసలు నీకు ఏమాత్రం బాధ్యత లేదు కదా అంటూ రిషి పై తనకు ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది. జగతి కూడా దేవయానికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతుంది.
అంతలో ధరణి అక్కడికి రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తారు.మరోవైపు రిషి వసుధార అమ్మాయిని తీసుకెళ్లి తమ ఇంటి వద్ద దింపుతారు. నన్ను కాపాడి చాలా సహాయం చేశారు సార్ నా తృప్తి కోసం మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని చెబుతుంది. ఆ అమ్మాయి అంతగా బ్రతిమలాడడంతో చేసేదేమీ లేక వసుధార రిషి లోపలికి వెళ్తారు.ఇక ఆ అమ్మాయి మా నాన్నను పరిచయం చేస్తాను సార్ అంటూ వారిని లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి రౌడీలను లేపుతుంది. ఇలా ఒక్కసారిగా రౌడీలు రిషి వసుధారపై దాడి చేసేసరికి షాక్ అవుతారు.
రిషి వారిని కొడుతూ ఉండగా ఆ అమ్మాయి వసు మెడ వద్ద కత్తి పెట్టి దగ్గరకు వస్తే కత్తి వసుధార మెడలో దిగుతుందని బెదిరిస్తుంది. రేయ్ వారి వద్ద కార్ కీస్ ఫోన్లు లాక్కొండి అని చెప్పడంతో వాటిని తీసేసుకుని వారిద్దరిని గదిలో పెట్టి బయటకు వెళ్ళిపోతారు. దీంతో వసుధార రిషి తలుపు తెరవండి బయట ఎవరైనా ఉన్నారా అంటూ గట్టిగా అరుస్తుంటారు. అసలు ఎవరు సార్ ఈ అమ్మాయి ఇంత ప్లాన్ గా మనల్ని కిడ్నాప్ చేసింది అని వసుధర అడుగుతుంది. అసలు మనకు శత్రువులు ఎవరున్నారు అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు.
ఈ రోజుల్లో ఇంత మంచిగా ఉంటే అసలు సరిపోదు మిస్టర్ రిషేంద్ర భూషణ్అని అంటారు అసలు తనని ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారు అనే విషయం గురించి రిషి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కాలేజీలో జరిగిన సంఘటన గుర్తుకు రావడంతో సౌజన్య రావు ప్లాన్ అయి ఉంటుందని భావించి మరి తను ఇంత చీప్ గా ట్రై చేస్తారని అనుకోలేదు అంటూ మాట్లాడుతారు. మన కాలేజ్ ని దెబ్బతీయడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారనీ రిషి అనగా వసుధార కంగారుపడుతుంది అప్పుడు రిషి వసుధారకు ధైర్యం చెబుతాడు.
మరోవైపు సౌజన్య రావు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు ఎందుకు చేశారని ఆలోచిస్తూ ఉంటావు కదా రిషి. నేను నిన్ను కిడ్నాప్ చేశాను ఎప్పటినుంచో నీ పతనం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పటికి నాకు ఆ అవకాశం దొరికింది రాజారాణి ఇద్దరికీ ఇలా చెక్ పెట్టేసాను అనుకుంటున్నారు. మరోవైపు తనకు అవతల నుంచి ఎవరో మెసేజ్ చేయగా పని పూర్తి అయ్యిందని చెప్పడమే కాకుండా వారిద్దరు తప్పించుకోవడానికి వీలులేదని రౌడీలకు జాగ్రత్తలు చెబుతుంటారు
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.